ఎక్కువ ఓటర్లు పర్మినెంట్ షిఫ్టింగ్ జిల్లాలో తొలగింపులో ఇవే అధికం ఆదిలాబాద్‌లో ఎక్కువగా షిఫ్టింగ్, డూప్లికేట్, ఆబ్సెంట్, అదర్స్.. డెత్ ఓటర్లు మాత్రం బోథ్‌లో అధికం
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్ సమ్మరి రివిజన్) ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, వాటి స్వీకరణ, డిజిటలైజేషన్ అంశాల్లో స్పష్టత వచ్చింది. డెత్, పర్మినెంట్ షిఫ్టింగ్, డూప్లికేట్, ఆబ్సెంట్, అదర్స్ అంశాల ఆధారంగా జిల్లాలో తొలగింపునకు గురయ్యే ఓటర్ల లెక్క ఇక తేలినట్టే.
బీఎల్‌వో సమక్షంలో ఎన్యూమరేషన్ ఫారాలు పూరిస్తున్న ఓటర్లు (ఫైల్)
నియోజకవర్గం వారీగా తొలగింపునకు గురయ్యే ఓట్లు..
నియోజకవర్గం డెత్ పర్మినెంట్ షిఫ్టింగ్ డూప్లికేట్ ఆబ్సెంట్ అదర్స్ మొత్తం
ఆదిలాబాద్ 5,838 18,568 4,180 10,966 112 39,664
బోథ్ 7,518 11,737 3,368 822 50 23495
సాక్షి,ఆదిలాబాద్: సర్ ప్రక్రియలో భాగంగా జిల్లాలో ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలను పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకున్నారు. జిల్లా పరిధిలోకే వచ్చే ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాలను నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్‌లో అలాగే గాదిగూడ, నార్నూర్ మండలాలను కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలో లెక్కించారు. జిల్లాలో 4లక్షల 66వేల 784 మంది ఓటర్లు ఉండగా, బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌వో)లు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ వందశాతం పూర్తి చేశారు. డిజిటలైజేషన్ 4లక్షల 3వేల 625 మంది ఓటర్లకు సంబంధించి పూర్తయ్యాయి. మొత్తం 86.47 శాతంగా ఉంది. ఇందులో ఆదిలాబాద్‌లో 84.16 శాతం, బోథ్‌లో 89.14 శాతంగా నమోదైంది.
ఆయా అంశాల్లో అధికం..
జిల్లాలో తొలగింపునకు గురయ్యే ఓటర్ల పరంగా చూస్తే.. డెత్ ఓటర్లలో బోథ్ నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నాయి. పర్మినెంట్ షిఫ్టింగ్, డూప్లికేట్, ఆబ్సెంట్, అదర్స్ అంశాల్లో ఆదిలాబాద్ నియోజకవర్గంలో అత్యధికంగా ఉండడం గమనార్హం. ఎక్కువ తొలగింపునకు గురవుతున్న పర్మినెంట్ షిఫ్టింగ్ ఓటర్ల అంశం పరంగా.. కొన్ని మండలాల్లో అత్యధికంగా ఉన్నాయి. వాటిలో.. ఆదిలాబాద్‌అర్బన్‌లో ఏకంగా 8,600, మావలలో 5,104, ఆదిలాబాద్‌రూరల్‌లో 1,814, బేలలో 1,389 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే బోథ్ నియోజకవర్గంలోని బజార్‌హత్నూర్‌లో 1,799, ఇచ్చోడలో 1,763, బోథ్‌లో 1,741, గుడిహత్నూర్‌లో 1,534, భీంపూర్‌లో 1,287 ఓటర్లు ఉన్నారు.
నియోజకవర్గాల వారీగా డిజిటలైజేషన్..
ఆదిలాబాద్ నియోజకవర్గం
మండలం మొత్తం ఓటర్లు ఫారాల పంపిణీ డిజిటలైజేషన్
భోరజ్ 15,123 15,123 14,013
జైనథ్ 20,040 20,040 18,766
సాత్నాల 10,934 10,934 9,750
బేల 27,380 27,380 24,754
ఆదిలాబాద్‌రూరల్ 33,637 33,637 30,491
మావల 39,309 39,309 30,518
ఆదిలాబాద్‌అర్బన్ 1,03,970 1,03,970 82,437
మొత్తం 2,50,393 2,50,393 (100%) 2,10,729 (84.16%)
బోథ్ నియోజకవర్గం
భీంపూర్ 19,579 19,579 17,028
తాంసి 13,889 13,889 12,722
తలమడుగు 28,063 28,063 25,709
గుడిహత్నూర్ 25,673 25,673 22,567
ఇచ్చోడ 35,633 35,633 32,205
సిరికొండ 7,114 7,114 6,645
బజార్‌హత్నూర్ 23,945 23,945 20,412
సొనాల 10,883 10,883 9,724
బోథ్ 27,458 27,458 24,317
నేరడిగొండ 24,154 24,154 21,567
మొత్తం 2,16,391 2,16,391 (100%) 1,92,896 (89.14%)
ఎన్యూమరేషన్


