భోర్‌జ్ మండలం డొలార సమీపంలో బ్రిడ్జిని ఆనుకుని ప్రవహిస్తున్న పెన్‌గంగ
బోథ్ మండలంలోని కరత్వాడ ప్రాజెక్టు పూర్తిగా నిండి అలుగు దూకుతోంది. ఈ జలదృశ్యం వీక్షించేందుకు సమీప గ్రామాల ప్రజలు భారీగా తరలివస్తున్నారు.
ఇంద్రవెల్లి: ముత్నూర్ సమీపంలోని త్రివేణి చెరువు వద్ద చేపలు పడుతూ..
పెన్‌గంగ ఉధృతి
నిండుకుండగా.. సాత్నాల
ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండడంతో సాత్నాల ప్రాజెక్టు నీటిమ ట్టం క్రమంగా పెరుగుతోంది. పూర్తి స్థాయి నిల్వసామర్థ్యం 1.24 టీఎంసీ కాగా ప్రస్తుతం 1.02 టీఎంసీగా ఉంది.
బోథ్ మండలంలోని పొచ్చెర జలపాతం ఇటీవల కురుస్తున్న వర్షాలకు జలకళ సంతరించుకుంది. జల సోయగాలతో ఆకట్టుకుంటోంది.
సెలయేళ్లు.. పరవళ్లు
వర్షాల కారణంగా జిల్లాలో పెన్‌గంగ పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికే వరద పోటెత్తింది. పలుచోట్ల బ్రిడ్జిలపై నుంచి ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జైనథ్ మండలం బహుదూర్‌పూర్ సమీపంలోని బ్రిడ్జిపై వరద శుక్రవారం ఉదయం కొంతసేపు కొనసాగింది. ఆ సమయంలో అధికారులు వాహనాలను అనుమతించలేదు. భోరజ్ మండలం డోలార సమీపంలోని బ్రిడ్జితో పాటు ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరిశీలించారు. ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. మరోవైపు జలపాతాల సవ్వడి.. ప్రకృతి సోయగాలతో కనువిందు చేస్తోంది. గ్రామాల్లో చాలా చోట్ల చెరువులు నిండాయి. పాలనురుగు వలే అలుగు పారుతున్న దృశ్యాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి.
– జైనథ్/సాత్నాల/ఇంద్రవెల్లి/బోథ్
కొరటా–చనాఖాకు జలకళ
భోరజ్ మండలంలోని కొరటా – చనా ఖాకు భారీగా వరద చేరుతుంది. నీటి నిల్వ సామర్థ్యం 0.830 టీఎంసీ కాగా ప్రస్తుతం 0.214.4 టీఎంసీగా ఉంది. అలాగే ఇన్‌ఫ్లో 8,650.79 క్యూసెక్కులుగా కొనసాగుతుండగా అవుట్‌ఫ్లో 8,650.79 క్యూసెక్కులుగా ఉంది.


