ఎయిర్‌పోర్టు భూసర్వే ప్రక్రియ షురూ | - | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టు భూసర్వే ప్రక్రియ షురూ

Jul 31 2026 11:59 PM | Updated on Jul 31 2026 11:59 PM

● సరిహద్దులు గుర్తిస్తున్న సర్వేయర్లు

కైలాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ భూసేకరణ కు సంబంధించిన ప్రాథమిక ప్రక్రియ షురూవైంది. భూసేకరణ, హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్ల తరలింపు, వా గుల మళ్లింపు, కరెంట్‌ స్తంభాల తొలగింపు వంటి తదితర పనుల కోసం ప్రభుత్వం ఇటీవల రూ. 2,278.14కోట్ల నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ భూ సేకరణ ప్రక్రియను ఏ విధంగా చేపట్టాలనే దానిపై హైదరాబాద్‌ ఆర్‌అండ్‌ఆర్‌ కమి షనరేట్‌ నుంచి గురువారం వచ్చిన ఉన్నతాధికారి మనోహర్‌ కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులు, సర్వేయర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్ర మం నిర్వహించారు. సర్వేవిధానంపై అవగాహన కల్పించారు. న లుగురు సర్వేయర్లతో అధికారులు ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీరు శుక్రవారం పనులను ప్రా రంభించారు. ఎయిర్‌పోర్టు నిర్మాణ ప్రాంత భూ రికార్డులు పరిశీలిస్తూ వాటికనుగుణంగా సరిహద్దులు గుర్తించే ప్రక్రియ చేపడుతున్నారు. ప్రక్రియను ఆర్డీవో పి. జగదీశ్వర్‌రావు పరిశీలించారు. బృందాలకు సూచనలు చేశా రు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు డిసెంబర్‌ 31 వరకు ప్రక్రియ పూర్తిచేసి సంబంధిత ఏజెన్సీలకు భూమిని అప్పగించనున్నట్లు ఆర్డీవో వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement