ఆదిలాబాద్‌టౌన్: ఖైదీల సంక్షేమానికి ప్రాధాన్యం ఇ వ్వాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీసుశా ఖ చేపట్టిన సెక్యూరిటీ రివ్యూలో భాగంగా శుక్రవా రం జిల్లా జైలును సందర్శించారు. భద్రతా ఏర్పా ట్లు,ఖైదీల సంక్షేమం, పెరోల్ ప్రక్రియపై ఎస్పీ ఆరా తీశారు. అనంతరం ఆవరణను పరిశీలించి ఖైదీల బ్యారక్‌లు, జైలు ఆస్పత్రి, వంటశాల, పరి పాలన విభాగాలు, ఇతర గదులను తనిఖీ చేశారు. ప్రహరీ, ప్రధాన ద్వారం, వాచ్‌టవర్లు పరిశీలించి భద్రత ప్రమాణాలు పటిష్టంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో డీఎస్పీలు ఎల్.జీవన్‌రెడ్డి, వెంకటనర్సయ్య, జైలు ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ పి.గోపిరెడ్డి, జైలర్ ఎన్.చంద్రశేఖర్, సీఐ కె. నాగరాజు, ఆర్‌ఐ డి.వెంకటి,సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా నాకాబందీ
జిల్లా వ్యాప్తంగా శుక్ర వారం ప్రత్యేక నాకాబందీ ని ర్వహించారు. మొత్తం 25 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. ఇందులో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్‌రెడ్డి, టూటౌన్ సీఐ నాగరాజు, వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


