నేరడిగొండ: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన వి ద్య అందుతుందని బోథ్ ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ జా దవ్ పేర్కొన్నారు. మండలంలోని పెద్ద బుగ్గారం గ్రామంలోగల ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో ఏర్పాటు చేసిన డి జిటల్ ప్యానెళ్లు, తరగతి గదులను గురువారం ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రా ణించాలని సూచించారు. పాఠశాలకు రావడానికి ప్రత్యేకంగా సీసీ రోడ్డు నిర్మిస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల కోరిక మేరకు డైనింగ్ హాల్, వాటర్ ప్లాంట్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు విద్యార్థినులకు యూనిఫాంలు అందజేశారు.


