ప్రాజెక్ట్‌లలో నీటి నిల్వ | - | Sakshi
Sakshi News home page

ప్రాజెక్ట్‌లలో నీటి నిల్వ

Jul 31 2026 1:57 AM | Updated on Jul 31 2026 1:57 AM

ఏకధాటిగా కురుస్తున్న వర్షం

పొంగిన వాగులు, చెరువులు

పలుచోట్ల నిలిచిన రాకపోకలు

స్తంభించిన జాతీయ రహదారి

నిండుకుండలా జలాశయాలు

ప్రాజెక్ట్‌ పూర్తి నీటిమట్టం ప్రస్తుత పూర్తి నీటి సామర్థ్యం ప్రస్తుత నీటి వరద

(మీటర్లలో) నీటిమట్టం (టీఎంసీల్లో) సామర్థ్యం (క్యూసెక్కులు)

సాత్నాల 286.50 283.90 1.24 0.553 10,747

మత్తడివాగు 277.50 277.20 0.470 0.430 38,000

సాక్షి, ఆదిలాబాద్‌: ఆకాశానికి చిల్లు పడిందా..! అనే రీతిలో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లా తడిసి ముద్దయింది. కుండపోత వాన జనజీవనాన్ని స్తంభింపజేసింది. ఉప్పొంగిన వాగులు, వంకలతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలోని మధ్య తరహా ప్రాజెక్ట్‌లతో పాటు చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ధ్రోణి కారణంగా జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. విరామం లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా వాగులు, వంకలు, రోడ్లు, డ్రైనేజీలు వరద నీటితో జోరుగా ప్రవహిస్తున్నాయి. బుధ, గురువారాల్లో ఏకధాటిగా భారీ వర్షాలు కురవగా, శుక్రవారం కూడా జిల్లాలో తేలికపాటి నుంచి మధ్యస్థ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

నిలిచిన రాకపోకలు

బజార్‌హత్నూర్‌ మండలంలో వాగులు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బోథ్‌ మండలం నక్కల్‌వాడ పెద్దవాగు, ధనోర వాగు ఉప్పొంగడంతో ఆరు గ్రామాలు, సొనాల మండలంలో వాగు ఉప్పొంగడంతో ఎనిమిది గ్రామాలు, కోట(కె)లో రెండు గ్రామాలు, నార్నూర్‌ మండలం కడ్కి–కొలాం గూడ మధ్య ప్రధాన రహదారి కల్వర్టు పైనుంచి వరద నీరు ప్రవహించడంతో నార్నూర్‌, గాదిగూడ మండలాల మధ్య రాకపోకలు స్తంభించాయి. బారిక్‌రావు గూడలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. బేల మండలంలో దహెగాం వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సిరికొండ మండలం చిక్‌మన్‌ వాగు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. బజార్‌హత్నూర్‌ చెరువు నిండుకుండను తలపిస్తోంది. జైనథ్‌ మండలం పిప్పల్‌గావ్‌లో వాగు ఉప్పొంగడంతో సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బోథ్‌ ఎస్సీ కాలనీలో పాత కూనపెంకుల ఇల్లు వర్షం ధాటికి కూలిపోయింది. మహారాష్ట్ర నుంచి తెలంగాణ మీదుగా వెళ్లే 353–బీ జాతీయ రహదారి భోరజ్‌ మండలం తర్నం వద్ద వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. ఈ రహదారి పైనుంచి వెళ్లే భారీ వాహనాలు నిలిచా యి. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణంలో ఉండడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ప్రత్యామ్నాయ దారులు ఉండడంతో పలు వాహనాలను పోలీసులు మళ్లించారు.

మత్తడివాగు వరదనీరు విడుదల

జిల్లాలో రెండు మధ్య తరహా ప్రాజెక్టులు సాత్నాల, మత్తడివాగు ప్రాజెక్ట్‌లు ఉండగా, మత్తడివాగుకు భారీగా వరద నీరు రావడంతో ఐదు గేట్లలో నా లుగింటిని ఎత్తి దిగువకు వదిలారు. సాత్నాల ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌ పూర్తి స్థాయి నీటిమట్టానికి ఇంకా దూరంగా ఉంది. జిల్లాలోని చెరువులన్నింటికీ జలకళ సంతరించుకుంది. పలు చెరువులు అలుగు పారుతున్నాయి.

మండలాల్లో ఇదీ పరిస్థితి

రెండు రోజుల కిందటి వరకు అన్ని మండలాల్లో వ ర్షాభావ పరిస్థితులు ఉండగా, ప్రస్తుతం పూర్తిగా మారిపోయింది. జిల్లాలోని 12 మండలాలు భీంపూర్‌, జైనథ్‌, బేల, గుడిహత్నూర్‌, ఆదిలాబాద్‌అర్బన్‌, మావల, తాంసి, తలమడుగు, బోథ్‌, నేరడిగొండ, ఇచ్చోడ, భోరజ్‌ సాధారణ వర్షపాతానికి చేరుకున్నా యి. గాదిగూడ, నార్నూర్‌, ఇంద్రవెల్లి, ఆదిలాబాద్‌రూరల్‌, బజార్‌హత్నూర్‌, సిరికొండ, ఉట్నూర్‌, సొనాల, సాత్నాల మండలాలు ఇప్పటికీ వర్షాభావ పరిస్థితుల్లో ఉన్నాయి. అయితే, ఈ మండలాల్లోనూ భారీగా వర్షం కురవడంతో ఇవి కూడా సాధారణ స్థితికి చేరుకునే అవకాశముంది.

జిల్లాలో వర్షపాతం

(జూన్‌ 1నుంచి 30వరకు)

స్థితి సాధారణ వర్షపాతం

సాధారణం 523.1 మి.మీ.లు

కురిసింది 426.3 మి.మీ.లు

వ్యత్యాసం 19 శాతం లోటు

రెండు రోజుల వర్షపాతం వివరాలు

మంగళ–బుధ 52.2 మి.మీ.లు

బుధ–గురు 64.6 మి.మీ.లు

గురువారం ఉదయం

8.30నుంచి సాయంత్రం 54.4 మి.మీ.లు

5గంటల వరకు

చెరువుల్లోకి చేరిన నీరు

మొత్తం చెరువులు 331

25–50 శాతం 16

50–75 శాతం 66

75–100 శాతం 66

అలుగు పారుతున్నవి 183

మండలాల వారీగా

వర్షపాతం (మి.మీ.లు)

ఇచ్చోడ 122.4

బజార్‌హత్నూర్‌ 117.6

ఇంద్రవెల్లి 96.6

బేల 86.9

నేరడిగొండ 81.5

సిరికొండ 81.0

బోథ్‌ 72.5

గుడిహత్నూర్‌ 67.9

తలమడుగు 67.5

సాత్నాల 61.5

జైనథ్‌ 59.0

భోరజ్‌ 55.8

ఆదిలాబాద్‌రూరల్‌ 53.1

మావల 52.4

ఆదిలాబాద్‌అర్బన్‌ 52.3

ఉట్నూర్‌ 50.2

గాదిగూడ 45.4

తాంసి 42.2

సొనాల 36.5

భీంపూర్‌ 32.2

నార్నూర్‌ 21.4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement