తలమడుగు: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని గిరిజన సంక్షేమశాఖ జిల్లా బాలి కల అభివృద్ధి అధికారి (జీసీడీవో) మెస్రం ఛా య సూచించారు. గురువారం మండలంలోని ఉమ్రీ బాలికల ఆశ్రమ పాఠశాలను తనిఖీ చే శారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో సమావేశమై మాట్లాడారు. పరిసరాలు, వ్యక్తిగత పరి శుభ్రత పాటించాలని, మరిగించిన నీటిని తా గాలని సూచించారు. అనారోగ్య లక్షణాలు కని పిస్తే వెంటనే ఉపాధ్యాయులు, వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. అనంతరం విద్యార్థినుల ఆరోగ్య రికార్డులు పరిశీలించారు. వారితో మాట్లాడి ఆరోగ్య పరీక్షలు, పో షకాహారం అందుతున్న తీరు తెలుసుకున్నార. సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు.


