హై అలర్ట్
అప్రమత్తంగా ఉండాలి
ఆదిలాబాద్ టౌన్: జిల్లాకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసినందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే గాని ఇళ్ల నుంచి బయటకు రావద్దు. వరదలతో ఏమైన ఇబ్బందులుంటే కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూం టోల్ ఫ్రీ నంబర్‌ను లేదా ‘డయల్ 100’ను సంప్రదించాలి. డీడీఆర్‌ఎఫ్ బృందం జిల్లాలో 24 గంటల పాటు అందుబాటులో ఉండి తక్షణ సహాయక చర్యలు చేపడతారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవ ద్దు. జలపాతాల వద్ద సెల్ఫీల కోసం ఆరాటపడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. రైతులు విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్త వహించా లి. చెట్లు, శిథిల భవనాల కింద ఎదరూ ఉండరాదు. వాహనదారులు జాగ్రత్తగా వాహనా లు నడపాలి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాలు లాంటి సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశముంది. కాచి చల్లార్చిన లేదా శుద్ధి చేసిన నీటినే తాగాలి. ఇళ్ల పరిసరా లు, పూలకుండీలు, ఎయిర్ కూలర్లు, పాత టైర్లు, ఖాళీ డబ్బాల్లో నీరు నిల్వకుండా చూ డాలి. జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, వాంతులు, విరోచనాలు లాంటి లక్షణాలు క నిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్యకేంద్రాన్ని సంప్రదించాలి. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నాం.
కై లాస్‌నగర్: జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ.. వాగులు, వరద ప్రవాహ ప్రాంతాలకు వెళ్లకుండా చర్యలు చేపట్టింది. అత్యవసర సాయం కోసం కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన అధికారులు 1800 425 1939 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. ఇందులో 24గంటలు పనిచేసేలా మూడు షిఫ్టుల్లో ఇద్దరేసి చొప్పున ఉద్యోగులను నియమించారు. ప్రభుత్వ ఽశాఖల అధికారులంతా 24గంటల పాటు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
టాం.. టాం.. ప్రత్యేక భద్రత
ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా గ్రామాలు, మున్సిపాలిటీలోని వార్డుల్లో పంచాయతీ, మున్సిప ల్ సిబ్బంది ద్వారా టాం..టాం చేయించారు. ఉ ప్పొంగి ప్రవహించే వాగులు, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండే లోలెవల్ వంతెనల వద్ద రాకపోకలు సాగించకుండా ఉండేలా హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పా టు చేశారు. పోలీస్ సిబ్బందితో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. పెన్‌గంగా పరీవాహక ప్రాంతాలతో పాటు జిల్లాలోని ముంపు గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా అప్రమత్తం చేశారు. అత్యవసర పరిస్థితులెదురైనా ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా ఫైర్, పోలీస్ యంత్రాంగంతో కూడిన డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పా న్స్ ఫోర్సు (డీడీఆర్‌ఎఫ్)ను అందుబాటులో ఉంచారు.
కలెక్టర్, ఎస్పీల ప్రత్యేక పర్యవేక్షణ
వరద పరిస్థితులను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ స్వయంగా పరిశీలించారు. జోరుగా కురుస్తున్న వర్షాన్ని లెక్క చేయకుండా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. తాంసి మండలంలోని మత్తడివాగు ప్రాజెక్ట్, తలమడుగు మండలంలోని ఖోడద్, సుంకుడి గ్రామాల్లోని లోలెవల్ వంతెనలు పరిశీలించారు. తర్నం వాగు ఉధృతి పెరిగి రాకపోకలు నిలిచిన నేపథ్యంలో ఎస్పీ స్వయంగా పరిశీలించి భద్రత చర్యలపై పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. నిరంతరం అప్రమ్తతంగా ఉంటూ విధులు నిర్వహించాలని ఆదేశించారు.
రెండు గంటలకోసారి నివేదిక
భారీ వర్షాలు, వరద పరిస్థితిని కలెక్టర్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. లోతట్టు ప్రాంతాల పరిస్థితులు, ప్రాజెక్ట్‌ల్లోకి చేరుతున్న వరదనీరు, శిథిలావస్థకు చేరిన భవనాలు, పాఠఽశాలల స్థితిగతులు, విద్యుత్ సరఫరా వ్యవస్థ గురించి తెలుసుకుంటున్నారు. విద్యుత్ లైన్లు, స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు నష్టం జరిగితే విద్యుత్‌కు అంతరాయం కలగకుండా తక్షణమే పునరుద్ధరించేలా సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. చెట్ల కొమ్మలు విరిగిపడితే తక్షణమే తొలగించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తహసీల్దార్లు, ఎంపీడీవోల ద్వారా ప్రతీ రెండు గంటలకోసారి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ముంపు ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని అధికారులు, ఉద్యోగులతో సెల్‌ఫోన్‌లో మాట్లాడి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకున్నారు.


