కై లాస్‌నగర్/ఆదిలాబాద్: కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ల త్యాగం, ధైర్యసాహసాలు, దేశభక్తి మనందరికి స్ఫూర్తిదాయకమని అదనపు కలెక్టర్ ఆర్‌ఎస్.చిత్రు, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష అన్నారు. కార్గిల్ విజ య్ దివస్ పురస్కరించుకుని పట్టణంలోని మున్సి పల్ పార్కులో గల అమరవీరుల స్తూపం వద్ద ఆది వారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహనీయుల వీరత్వాన్ని స్మరించుకుంటూ కార్గిల్ విజయ్ దివస్‌ను గర్వంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వన్‌టౌన్ సీఐ సునీల్, సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రీ, రిటైర్డ్ ఆర్మీ అసోసియేషన్ ప్రతినిధులు, ఆర్మీ అధికారులు పాల్గొన్నారు.


