ఎట్టకేలకు ‘పరిషత్‌’ సమావేశాలు | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు ‘పరిషత్‌’ సమావేశాలు

Jul 27 2026 1:42 AM | Updated on Jul 27 2026 1:42 AM

● ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ● రెండేళ్ల తర్వాత ఈ నెల 29న నిర్వహణ ● స్థానిక సమస్యల పరిష్కారంపై ఆశలు

కై లాస్‌నగర్‌: మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశా ల నిర్వహణకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. ఇ క నుంచి ప్రతి 45 రోజులకోసారి విధిగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మే రకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. తతదనుగుణంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు అన్ని మండలాల్లో ఈనెల 29న సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. మండల అధ్యక్షులు లేకపోవడంతో ప్రత్యేకాధికారి అధ్యక్షతన కొనసాగనున్నాయి. రెండేళ్ల తర్వాత నిర్వహించనున్న సమావేశాలతో స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారంపై గ్రామీణులు గంపెడాశలు పెట్టుకున్నారు.

ఇదీ పరిస్థితి..

పాలకవర్గాలు ఉన్న సమయంలో ప్రతీ మూడు నెలలకోసారి మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశాలు జరిగేవి. ఎంపీపీ అధ్యక్షతన ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించే సమావేశానికి జెడ్పీటీసీతో పాటు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మండల, పలువురు డివిజన్‌ స్థాయి అధికారులు హాజరయ్యేవారు. గ్రామాల సమస్యలను సభ్యులు ఇందులో ప్రస్తావించేవారు. అధికారుల దృష్టికి రావడంతో పాటు పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు అవకాశముండేది. అయితే పరిషత్‌ పాలకవర్గాల గడువు 2024 జూన్‌ 24న ముగిసింది. ప్రభుత్వం తిరిగి ఎన్నికలు నిర్వహించలేదు. ఎంపీపీల స్థానంలో ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించినా సమావేశాలు మాత్రం నిర్వహించని పరిస్థితి. పాలకవర్గాలు లేకపోవడంతో గ్రామాల్లో కార్యదర్శులు మినహా ఇతర శాఖల అధికారులు పర్యటించిన దాఖలాలు కన్పించడం లేదు. ఇటీవల ప్రభుత్వం సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించగా వారిలో చాలా మంది కొత్తవారే ఎన్నికయ్యారు. సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి చాలామందిలో ఉంది. మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహిస్తే స్థానికంగా ఉన్న సమస్యలను ఆయా శాఖల అధికారుల దృష్టికి తీసుకొచ్చే అవకాశముండేది.

సమస్యల పరిష్కారంపై ఆశలు..

రెండేళ్ల జాప్యం తర్వాత ఎట్టకేలకు సర్వసభ్య సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మండల ప్రత్యేకాధికారి అధ్యక్షతన ప్రతి 45 రోజులకోసారి నిర్వహించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సర్పంచ్‌లతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల మండల స్థాయి అధికారులంతా హాజరుకానున్నారు. దీంతో గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సర్పంచ్‌లు వారి దృష్టికి తీసుకెళ్లే అవకాశముంటుంది. తద్వారా వాటి పరిష్కారానికి మోక్షం లభించే అవకాశముంటుంది. అలాగే పల్లెపాలన, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌లకు అవగాహన కల్పించేలా ఈ సమావేశాల ద్వారా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాల్లో స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement