తలమడుగు: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదర్శప్రాయుడని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండలంలోని పల్లి బి గ్రా మంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గా ల అభ్యున్నతికి అంబేడ్కర్ అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, సామాజిక కార్యకర్త మౌనిష్ రెడ్డి, శ్రీకాంత్, కిరణ్ కుమార్, వెంకటేశ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రతా ప్, తదితరులు పాల్గొన్నారు.


