మండల పరిషత్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అందాయి. తదనుగుణంగా చర్యలు చేపడుతున్నాం. ఈనెల 29న జిల్లాలోని అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆదేశించాం. మండల ప్రత్యేకాధికారి అధ్యక్షతన జరిగే సమావేశంలో సర్పంచ్‌లతో పాటు మండలస్థాయి అధికారులంతా హాజరవుతారు. గ్రామీణ సమస్యలు చర్చకు వస్తాయి. వాటి పరిష్కారానికి అవకాశం ఉంటుంది. సర్పంచ్‌లు సద్వినియోగం చేసుకోవాలి.
– బి.రవి, జెడ్పీసీఈవో


