ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలి | - | Sakshi
Sakshi News home page

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలి

Jul 22 2026 2:23 AM | Updated on Jul 22 2026 2:23 AM

సంతనూతలపాడు: నీట్‌ ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెంటనే రాజీనామా చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బీ వీరస్వామి డిమాండ్‌ చేశారు. మంగమూరు గ్రామంలో విద్యార్థినీ, విద్యార్థులతో నిర్వహించిన కొవ్వొత్తుల నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈ 12 ఏళ్ల కాలంలో 89 ప్రశ్నపత్రాలు లీకయ్యాయన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని దుయ్యబట్టారు. నీట్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా 12 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, లక్షలాది మంది తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళనకు గురయ్యారని అన్నారు. సీఐటీయూ నాయకుడు కందుల రవి మాట్లాడుతూ ఢిల్లీలో నీట్‌ ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరుతూ సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌ చుక్‌ ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేస్తూ అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అబ్బూరి వెంకటేశ్వర్లు నాయకులు అన్నాబత్తిన బ్రహ్మయ్య సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బంకా సుబ్బారావు, మండల కన్వీనర్‌ షేక్‌ మస్తాన్‌, నాయకులు షేక్‌ నాగూర్‌ , తిప్పాబత్తిన రాము, ఎం శ్రీను మహిళా సంఘం నాయకురాలు కే పద్మ, విద్యార్థి నాయకులు కే మధు, అనీల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement