అంగన్‌వాడీ, పాఠశాలలను పరిశీలించిన ఎంపీడీవో | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ, పాఠశాలలను పరిశీలించిన ఎంపీడీవో

Jul 22 2026 2:23 AM | Updated on Jul 22 2026 2:23 AM

సంతనూతలపాడు: మండలంలోని పి.తక్కెళ్లపాడు గ్రామంలో మంగళవారం ఎంపీడీవో సురేష్‌ బాబు అంగన్‌వాడీ, మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలను పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో విద్యార్థుల హాజరు, రికార్డులు, మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి అంగన్‌వాడీ టీచర్లు, ఉపాధ్యాయులకు పలు సూచనలు ఇచ్చారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. డిప్యూటీ ఎంపీడీవో పి.రవికుమార్‌, పాఠశాల హెచ్‌ఎం.సరస్వతి, అంగన్‌వాడీ టీచర్‌ నువ్వల పద్మ తదితరులు పాల్గొన్నారు.

ఆధార్‌ స్పెషల్‌ క్యాంప్‌ పరిశీలన:

మద్దులూరు పంచాయతీ పరిధి మాచవరంలోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం ప్రారంభమైన ఆధార్‌ స్పెషల్‌ క్యాంపును ఎంపీడీవో డి.సురేష్‌ బాబు పరిశీలించారు. ప్రభుత్వం కల్పించిన ఆధార్‌ స్పెషల్‌ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో సురేష్‌ బాబు కోరారు. ఈనెల 24వ తేదీ వరకు ఈ క్యాంపు జరగనున్నట్టు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో పి.రవికుమార్‌, ప్రధానోపాధ్యాయులు చెన్నయ్య, మద్దులూరు గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి ఆర్‌.శ్రీనివాసులు, ఆధార్‌ ఆపరేటర్‌ చక్రధర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement