దరఖాస్తులు.. మస్తు | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తులు.. మస్తు

Jul 23 2026 1:48 AM | Updated on Jul 23 2026 1:48 AM

ఏజెన్సీ పరిధిలో ‘అంగన్‌వాడీ’ల భర్తీ ప్రక్రియ

242 పోస్టులకు 3,209 అప్లికేషన్లు

కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన

త్వరలో ఇంటర్వ్యూలు

పోస్టులు, దరఖాస్తుల వివరాలు

పోస్టులు అందిన దరఖాస్తులు

టీచర్‌ 63 1,085

ఆయా 179 1,360

ఆదిలాబాద్‌టౌన్‌: అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. కొన్నేళ్లుగా టీచర్‌, ఆయా పోస్టుల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులు పెద్దఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. ఏజెన్సీ పరిధిలోని నాలుగు మండలాలకు సంబంధించి ఇటీవల ఐసీడీఎస్‌ అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియడంతో అధికారులు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నారు. వచ్చే నెలలో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. అనంతరం మైదాన ప్రాంతంలో పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

భారీ సంఖ్యలో దరఖాస్తులు..

అంగన్‌వాడీ టీచర్‌, ఆయా పోస్టులకు సంబంధించి ఈనెల 7న నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆన్‌లైన్‌లో ఈ నెల 20 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఏజెన్సీకి సంబంధించి నార్నూర్‌ ప్రాజెక్ట్‌ పరిధిలో గాదిగూడ, నార్నూర్‌, ఉట్నూర్‌ ప్రాజెక్ట్‌ పరిధిలోని ఇంద్రవెల్లి, ఉట్నూర్‌ మండలాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం విధితమే. మొత్తం 242 పోస్టులకు గాను టీచర్‌, ఆయా పోస్టులకు సంబంధించి ప్రాజెక్టలు, మండలాల వారీగా మొత్తం 3209 దరఖాస్తులు వచ్చాయి.

కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన..

అంగన్‌వాడీ టీచర్‌, ఆయా పోస్టులకు అభ్యర్థులు పెద్దసంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం అధికారులు అప్లికేషన్లను పరిశీలిస్తున్నారు. నార్నూర్‌, ఉట్నూర్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈనెల 25 వరకు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అనంతరం అభ్యర్థులకు సంబంధించి జాబితా విడుదల చేస్తారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం కమిటీ సర్టిఫికెట్లను మరోసారి పరిశీలించనుంది. ఇది పూర్తయిన తర్వాత జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఈ కమిటీలో కలెక్టర్‌, ఐటీడీఏ పీవో, డీఎంహెచ్‌వో, జిల్లా సంక్షేమ అధికారి ఉంటారు.

పైరవీలు షురూ..

అంగన్‌వాడీ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ విడుదల కావడంతో పలువురు పైరవీలకు తెర లేపుతున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే తమ వారికే పోస్టు కేటాయించాలని కొంత మంది రాజకీయ నాయకులు ఐసీడీఎస్‌ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియలో ఇంటర్మీడియెట్‌కు 70 మార్కుల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఇదిలా ఉండగా వితంతువులకు 5 మార్కులు, దివ్యాంగులకు 5 మార్కులు, అనాథలకు 10 మార్కులు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయిస్తారు.

మండలాల వారీగా..

ప్రాజెక్టు మండలం టీచర్‌ ఆయా

పోస్టులు దరఖాస్తులు పోస్టులు దరఖాస్తులు

నార్నూర్‌ గాదిగూడ 13 764 83 674

నార్నూర్‌ 12

ఉట్నూర్‌ ఉట్నూర్‌ 33 1085 96 686

ఇంద్రవెల్లి 5

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement