మహిళల ఆర్థికాభివృద్ధికి సీ్త్రనిధి చేయూత | - | Sakshi
Sakshi News home page

మహిళల ఆర్థికాభివృద్ధికి సీ్త్రనిధి చేయూత

Jul 23 2026 1:48 AM | Updated on Jul 23 2026 1:48 AM

● కలెక్టర్‌ రాజర్షిషా

ఆదిలాబాద్‌టౌన్‌: గ్రామీణ ప్రాంత మహిళల ఆర్థిక సాధికారతకు సీ్త్ర నిధి రుణాలు ఎంతో దోహదపడుతున్నాయని కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సీ్త్ర నిధి క్రెడిట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ స్వయం సహాయక సంఘాల మహిళలు రుణా లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిన్నతరహా పరిశ్రమలు, స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించా రు. అర్హులైన ప్రతి మహిళా సంఘానికి సకాలంలో రుణాలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా సీ్త్ర నిధి ద్వారా అందించిన రుణాలు, ఆర్థిక సాయం, రుణా ల పంపిణీ, వసూళ్ల పురోగతి, భవిష్యత్‌ కార్యాచరణపై సమీక్షించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌, డీఆర్డీవో రవీందర్‌, మెప్మా పీడీ రాజు, సీ్త్రనిధి జిల్లా ప్రతినిధులు, మండల సమాఖ్య ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రానికి పీవోఎస్‌

మిషన్‌ మంజూరు

ఆదిలాబాద్‌టౌన్‌: సాత్నాల మండలం మేడిగూడలోని జిల్లా కోఆపరేటివ్‌ మార్కెటింగ్‌ సొసైటీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి కలెక్టర్‌ రాజర్షిషా తక్షణమే పీవోఎస్‌ మిషన్‌ను మంజూరు చేశారు. బుధవారం యంత్రాన్ని అందజేశారు. మిషన్‌ అందుబాటులోకి రావడంతో ధాన్యం కొనుగోళ్లు, ఎలక్ట్రానిక్‌ రశీదుల జారీ మరింత వేగవంతంగా, పారదర్శకంగా సాగుతుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు కలెక్టర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు జాహ్నవి–శివప్రసాద్‌ దంపతులు కలెక్టర్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement