ఆదిలాబాద్: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతి యుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పో లీసులు లాఠీచార్జీ చేయడం దారుణమని కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడే గజేందర్ అన్నా రు. ఢిల్లీలో విద్యార్థుల నిరసనపై లాఠీచార్జి చేయ డం, రాహుల్‌గాంధీని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ జిల్లా కేంద్రంలో బుధవారం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఎంపీ ఇంటి ఎదుట ధర్నా చేపట్టారు. డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, కాంగ్రెస్ నాయకులతోకలిసి అంబేద్క ర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం గజేందర్ మాట్లాడుతూ, విద్యార్థుల పక్షాన నిలిచిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన దృష్ట్యా పోలీసులు రంగ ప్రవేశం చేసి నాయకులను అరెస్ట్ చేసి వన్‌టౌన్‌కు తరలించారు.
ఎంపీ క్యాంపు కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తూ..


