విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

Jul 17 2026 3:40 AM | Updated on Jul 17 2026 3:40 AM

సిరికొండ: గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఐటీడీఏ పీవో మంద మకరందు సూచించారు. మండలంలోని రిమ్మ గ్రామంలోని గిరిజన ఆ శ్రమ పాఠశాలను గురువారం ఆకస్మికంగా త నిఖీ చేశారు. రిజిష్టర్లు, విద్యార్థుల హాజరు న మోదు, వంటగది, పరిశుభ్రతను పరిశీలించా రు. పాఠశాల భవనానికి అవసరమైన మరమ్మతులు చేపట్టి మూడు నెలల్లోపు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఏటీడీవోను ఆదేశించా రు. అనంతరం గ్రామంలో నిర్వహించిన గ్రా మసభలో పాల్గొన్నారు. మండల కేంద్రంలో శిథిలావస్థకు చేరిన డీఆర్డీవో డిపో భవనాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఎంపీడీవో సంతోష్‌కుమార్‌, ఏవో శ్రద్ధారాణి, సర్పంచ్‌ జంగుబాయి, మాజీ సర్పంచ్‌ పెందుర్‌ అనిల్‌కుమార్‌ తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement