ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో విపత్తుల సమయంలో అత్యవసర సహాయక చర్యలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రి త్వ శాఖ, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ మూడు రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. 40మంది విద్యార్థులు శిక్షణలో పా ల్గొని నైపుణ్యాలు నేర్చుకున్నారని తెలిపారు. అత్యవసర సహాయక చర్యల కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎన్‌డీఎంఏ, తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ శాఖల్లో ఆధునిక పరికరాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి సురేశ్, స్టేషన్ అగ్నిమాపక అధికారి జైత్రామ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగి వర్ష, విద్యార్థులు పాల్గొన్నారు.


