నేరడిగొండ: బోరిగంలో పూజలు చేస్తున్న రైతులు, గ్రామస్తులు
బోథ్: పూజలు నిర్వహిస్తున్న నాయకులు, రైతులు
తాంసి: రామునిగుట్టపైకి నడుచుకుంటూ వెళ్తున్న మహిళలు
ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో పలుచోట్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ రైతులు, యువకులు గురువారం బోథ్ పట్టణంలో బిందెల్లో నీటిని తీసుకుని ఊరేగింపుగా వెళ్లి గ్రామదేవతలకు జలాభిషేకం నిర్వహించారు. అనంతరం పూజలు చేశారు. సొనాల మండలంలోని కోట(కె) గ్రామ యువకులు కప్పతల్లి ఆడారు. తాంసి మండలంలోని గుబిడిపెల్లికి చెందిన మహిళలు పాలోది రామునిగుట్టపైకి పాదయాత్ర చేపట్టారు. నైవేద్యం వండి రాములోరికి సమర్పించారు. నేరడిగొండ మండలంలోని వడూర్, బోరిగం గ్రామాల్లో రైతులు, గ్రామస్తులు గ్రామ దేవతలకు సంప్రదాయ పూజలు నిర్వహించారు. – బోథ్/తాంసి/నేరడిగొండ


