సంచలనం సృష్టించిన ఏసీబీ దాడులు
లంచంతో దొరికిన ఇద్దరు అధికారులు
మరో ఇద్దరి పాత్ర ఉందన్న నిందితులు
ఉన్నతాధికారి ప్రస్తావన చర్చనీయాంశం
సాక్షి, ఆదిలాబాద్: నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ (ఇరిగేషన్, క్యాడ్ డిపార్ట్‌మెంట్)లో ఏసీ బీ దాడులు సంచలనం సృష్టించాయి. ఆ శాఖ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ రాథోడ్ విఠల్‌తో పాటు అదే కార్యాల య ఏఈ రూపావత్ రమేశ్ గురువా రం రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడటం సంచలనం కలిగి స్తోంది. కాగా, ఇందులో ఓ డీఈ, మరో ఏఈ పాత్ర కూడా ఉందని, ఈ సంఘటన జరిగిన తర్వాత వారిద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఎవరికీ అందుబాటులోకి రావడం లేదనేది ఆ శాఖలో చర్చ సాగుతోంది. కాగా, ఏసీబీ అధికారు ల విచారణ సందర్భంగా పట్టుబడ్డ అధికారుల్లో ఒక రు ఓ ఉన్నతాధికారికి కూ డా లంచం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పినట్లు చ ర్చించుకుంటున్నారు. ఆ అధికారిని పిలిపించి వి చారణ చేపట్టగా, ఇ లాంటి అనుమతులకు తన పాత్ర ఉండదని అత డు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఇద్దరు అధికారులు ఇప్పుడు పట్టుబడగా, మరో ఇద్దరు అధికారుల విషయంలో ఏసీబీ ఏం నిర్ణయం తీసుకుంటుందో.
నలుగురి పాత్ర ఉందన్న బాధితుడు
సొనాలకు చెందిన చౌహాన్ విక్రమ్‌సింగ్ తన వ్యవసాయ భూమిలో పౌల్ట్రీ ఫార్మ్ నిర్మిస్తుండగా, దానికి సంబంధించి వివిధ అనుమతులు తీసుకున్నాడు. సమీపంలో ఉన్న కాలువ విషయంలో నీటిపారుద ల శాఖ నుంచి ఎన్వోసీ తీసుకోవాల్సి వచ్చింది. దీంతో జూన్ 9న నీటిపారుదల శాఖ అధికారులను సంప్రదించి ఈఈ పేరిట దరఖాస్తు ఇచ్చాడు. ఈఈ నుంచి డీఈ, ఏఈలకు దరఖాస్తు ఫార్వర్డ్ చేయగా, వారు సైట్ విజిట్ చేసినట్లు ఫిర్యాదుదారు పేర్కొంటున్నాడు. ఆ సమయంలోనే రూ.లక్ష లంచం ఇ వ్వాలని అధికారులు కోరినట్లు ఆరోపిస్తున్నాడు. దీ నిపై ఆదిలాబాద్ కార్యాలయంలో నలుగురు అధి కారులతో సంప్రదింపులు జరిగాయని, ఇందులో నలుగురు అధికారుల పాత్ర ఉందని ఆయన ఏసీబీ అధికారుల ముందు స్పష్టం చేసినట్లు సమాచారం.
నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధిశాఖ కార్యాలయం
ఇద్దరు అధికారులు ఏసీబీకి పట్టుబడటం, మరో ఇద్దరు అధికారుల పేర్లు ప్రస్తావనకు రావడం చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఓ అధికారి ప్రజాప్రతినిధికి బంధువు అనే చర్చ సాగుతోంది. ఫిర్యాదుదారు మాత్రం ఆ నలుగురు అధికారులపై చర్యలు తీసుకోవాలని చెబుతుండటం సంచలనం కలిగిస్తోంది. ఏసీబీ దాడుల తర్వాత మరో ఇద్దరు అధికారులు ఎవరికీ అందుబాటులోకి రాకుండా సెల్‌ఫోన్లు స్విచ్‌ఆఫ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.


