సేవ చేసే వారికే ఓటు
కైలాస్‌నగర్: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం. నిజాయతీ పరులు, సమర్థులు, సేవా భావం కలిగిన వారిని ఎన్నుకునే హక్కు రా జ్యాంగం కల్పించింది. ఐదేళ్లకోసారి వచ్చే ఓట్ల పండుగలో తాము భాగస్వాములవడం సంతో షంగా ఉంద ంటున్నారు నూతనంగా ఓటు హక్కు వినియోగించుకున్న యువత.
ఓటు ఎంతో విలువైంది..
ఓటు ఎంతో విలువైంది. తొలిసారిగా ఓటువేయడం సంతోషంగా ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. సేవ చేసే నాయకుడిని ఎన్నుకోవడమే లక్ష్యంగా నేను ఓటు వేశాను.
– మామిడాల యువనశ్రీ, భుక్తాపూర్
సద్వినియోగం చేసుకున్నా..
ఈసారి కొత్తగా ఓటు హక్కు వచ్చింది. ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి వెళ్లి సద్వినియోగం చేసుకున్నాను. సేవ చేసే అభ్యర్థికే ఓటు వేశాను. చదువుకున్న వారు చదువు రాని వారికి ఓటు విలువ తెలియజేసి వినియోగించేలా చూడాలి.
– మంద అంకిత, భుక్తాపూర్
సేవ చేసే వారికే ఓటు


