ఓటేసిన ప్రముఖులు
ఓటు హక్కు వినియోగించుకుంటున్న కలెక్టర్ రాజర్షి షా
కై లాస్‌నగర్/ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కలెక్టర్ రాజర్షి షా పట్టణంలోని సాత్నాల క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ 36వ వార్డులోని సీబీఆర్ మోడల్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కు విని యోగించుకున్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ జోగు ప్రేమేందర్ 34వ వార్డులో ఓటు హక్కు వినియోగించుకోగా, మాజీ చైర్‌పర్సన్ రంగినేని మనీషా 48వ వార్డులో ఓటు వేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎస్పీ ఓటు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉండగా, అదనపు కలెక్టర్ ఓటు మంచిర్యాలలో ఉంది. వారు పోస్టల్ ద్వారా తమ ఓటును ఆయా జిల్లాలకు పంపించారు.
కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే శంకర్..
సిరా చుక్క చూపుతున్న ఎస్పీ
ఓటేసిన ప్రముఖులు
ఓటేసిన ప్రముఖులు


