పటిష్ట బందోబస్తు
వెయ్యి మంది సిబ్బందితో ప్రత్యేక నిఘా పలుచోట్ల చెదురుముదురు ఘటనలు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన ఎస్పీ
ఆదిలాబాద్‌టౌన్: మున్సిపల్ ఎన్నికలకు పోలీసుశాఖ పటిష్ట బందోబస్తు నిర్వహించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వెయ్యి మంది సిబ్బందితో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. 35 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించగా, వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈకేంద్రాల్లో స్టాటిక్ ఫోర్సుతో పాటు ప్రత్యేక బలగాలను మోహరించారు. ముగ్గురు అదనపు ఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు, 21 మంది సీఐలు, 48 మంది ఎస్సైలతో పాటు మహిళా పోలీసు సిబ్బంది, హోంగార్డులు, రిజర్వు పోలీసులు, ప్రత్యేక బలగాలతో బందోబస్తు చేపట్టారు. బుధవారం నిర్వహంచిన ఈ ప్రక్రియను ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. చిన్నపాటి ఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. దీంతో యంత్రా ంగం ఊపిరి పీల్చుకుంది. పోలింగ్ కేంద్రాల్లోనికి ఓటర్లను తప్పా ఎవరిని అనుమతించలేదు. సెల్‌ఫో న్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, వాటర్, ఇంక్ బాటిళ్లు, పెన్నులు తీసుకెళ్లకుండా చర్యలు చేపట్టారు. దీంతో పాటు 14 రూట్లలో మొబైల్ పార్టీ, స్ట్రైకై ంగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌తో పర్యవేక్షణ జరిపారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ముగిసేంత వరకు పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు.
నిబంధనల ఉల్లంఘనులపై కేసులు
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ పోలింగ్ కేంద్రాల సమీపంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా నగదు పంచుతున్న ఇద్దరిపై వన్‌టౌన్‌లో కేసు నమోదు చేసినట్లు సీఐ సునిల్ కుమార్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని పట్టుకున్నారు. వారి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. భోరజ్ మండలం పిప్పర్‌వాడకు చెందిన కాటిపెల్లి రాజారెడ్డి నుంచి రూ.3,440, ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్‌కు చెందిన మేకల కృష్ణకుమార్ నుంచి రూ.2,700 స్వాధీనం చేసుకున్నారు. అలాగే వాట్సాప్‌లో మతం పేరిట ప్రచారం చేసిన పట్టణానికి చెందిన చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. హుండీలో విరాళం వేయడంతో మతం రక్షించబడదని.. బ్యాలెట్ బాక్సులో హిందువులకు ఓటు వేయాలని వాట్సాప్‌లో పోస్టు పెట్టినట్లు వివరించారు. ఇదిలా ఉండగా టూటౌన్ పరిధిలో ఓట ర్లకు అరటిపండ్లు పంచుతున్న ఆటోడ్రైవర్ మహ్మద్ అర్షద్‌పై కేసు నమోదు చేసి ఆటోను సీజ్ చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు.


