షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
ఉట్నూర్‌రూరల్: మండలంలోని నర్సాపూర్(బి) పంచాయతీ పరిధి మరపగూడ గ్రామానికి చెందిన హెరకుమ్ర రామారావు ఇల్లు సోమవారం షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైంది. రామారావు తన సొంత పని నిమిత్తం ఇంద్రవెల్లికి, భార్య చేనుకు వెళ్లింది. ఈక్రమంలో ఇంట్లో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో పిల్లలు బయట ఆడుకుంటున్నారు. గమనించిన స్థానికులు మంటలార్పివేశారు. ఈ ప్రమాదంలో బట్టలు, బియ్యం, జొన్నలు, మంచాలు, ఇతర సామగ్రి కాలిపోయాయి. సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. సర్పంచ్ హెరకుమ్ర గంగారాం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
కాగజ్‌నగర్‌రూరల్: పట్టణంలోని సర్‌సిల్క్‌కాలనీకి చెందిన దండె మంగ ఇంట్లో చోరీ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఈనెల 3న మంగ మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌లో తన కుమార్తె వద్దకు వెళ్లింది. తన మరిది శ్రీధర్ ఇచ్చిన సమాచారంతో ఈనెల 5న ఇంటికి వచ్చింది. ఇంటి తాళం పగులగొట్టి ఉండడం, వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంట్లో సుమారు 7 తులాల బంగారు, కిలో వెండిని గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చికిత్సపొందుతూ వ్యక్తి మృతి
నర్సాపూర్(జి): పురుగుల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గుండోల్ల లింగం (53) గత కొన్నినెలలుగా బీపీ, షుగర్‌తో బాధపడుతున్నాడు. ఈక్రమంలో మద్యానికి బానిసయ్యాడు. గతనెల 31న మద్యం తాగి ఇంటికి రాగా భార్య లక్ష్మి మందలించింది. పొలానికి వెళ్లివస్తానని ఇంట్లో చెప్పి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. వారు అక్కడికి చేరుకుని అతన్ని నిర్మల్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. భార్య ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు..
నర్సాపూర్(జి): రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ యువకుడు మృతిచెందినట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. సోన్ గ్రామానికి చెందిన మహమ్మద్ సల్మాన్ (37) మేసీ్త్ర పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం బైక్‌పై భెంసా వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి వస్తున్నాడు. మార్గమధ్యలో తురాటి ఎక్స్‌రోడ్డు వద్ద నిర్మల్ నుంచి భైంసా వైపు వెళ్తున్న లోకేశ్వరం గ్రామానికి చెందిన మోడం రాజు బైక్‌ను అతివేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సల్మాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని అంబులెన్స్‌లో భైంసా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతుడి అన్న మహమ్మద్ అబుద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పల్సిలో పుర్రె, ఎముకల లభ్యం
కుభీర్: మండలంలోని పల్సి గ్రామశివారులో గుర్తుతెలియని వ్యక్తి పుర్రె, ఎముకలు లభ్యమయ్యాయి. ఆదివారం చేనులో పనిచేసేవారికి దుర్వాసన రావడంతో వెళ్లి చూడగా పుర్రె ఎముకలు కనిపించడంతో గ్రామస్తులకు సమాచారమిచ్చారు. అక్కడ చెప్పులు, పురుగుల మందు డబ్బా లభించింది. సదరు వ్యక్తి పురుగుల మందుతాగి చాలా రోజులక్రితం ఆత్మహత్య చేసుకుని ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. గ్రామంలో ఒక యువకుడు మూడు నెలలుగా కనిపించడం లేదు. ఎముకలు అతనివా కావా అన్న విషయం తేలాల్సి ఉంది. పోలీసులు సోమవారం ఆ ఎముకలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.
షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం


