● కొనుగోలు కేంద్రాల మూసివేత ● రైతుల వద్దే 25 వేల టన్నులు ● దిగుబడి కొనాలని వేడుకోలు ● తప్పనిపరిస్థితిలో ఆందోళనలు | - | Sakshi
Sakshi News home page

● కొనుగోలు కేంద్రాల మూసివేత ● రైతుల వద్దే 25 వేల టన్నులు ● దిగుబడి కొనాలని వేడుకోలు ● తప్పనిపరిస్థితిలో ఆందోళనలు

Jan 7 2026 7:38 AM | Updated on Jan 7 2026 7:38 AM

● కొన

● కొనుగోలు కేంద్రాల మూసివేత ● రైతుల వద్దే 25 వేల టన్నుల

● కొనుగోలు కేంద్రాల మూసివేత ● రైతుల వద్దే 25 వేల టన్నులు ● దిగుబడి కొనాలని వేడుకోలు ● తప్పనిపరిస్థితిలో ఆందోళనలు

ఇది ఈ ఇద్దరు రైతుల పరిస్థితే అనుకుంటే పొరపాటు.. జిల్లాలో వేలాది మంది రైతుల వద్ద ఇప్పుడు సోయా నిల్వలు పేరుకుపోయాయి. మద్దతు ధరకు అమ్ముకుందామంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను మూసివేశారు. ప్రైవేట్‌లో విక్రయిద్దామంటే తక్కువ ధర చెల్లిస్తున్నారు. ఇలా జిల్లాలో సుమారు 25వేల టన్నుల సోయా పంట రైతుల వద్దే ఉండిపోయింది. నాణ్యత లేని పంట విక్రయానికి వస్తోందని మార్క్‌ఫెడ్‌ పూర్తిగా కొనుగోళ్లు నిలిపివేసింది. అయితే.. కొనుగోలు కేంద్రాలకు రాని నిల్వల్లో నాణ్యత కలిగిన పంట కూడా ఉంది. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

సాక్షి, ఆదిలాబాద్‌: జిల్లాలో ఈ వానాకాలంలో 68 వేల ఎకరాల్లో సోయాబీన్‌ సాగైంది. 54వేల టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వే సింది. నాఫెడ్‌కు అనుబంధంగా రాష్ట్రంలో మార్క్‌ఫెడ్‌ జిల్లాలో పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నవంబర్‌ 2నుంచి కొనుగో ళ్లు ప్రారంభించింది. ఇప్పటివరకు 15,500 టన్నులు కొనుగోలు చేసింది. వందలాది మంది రైతులు ప్రైవేట్‌లోనూ వేల టన్నులు విక్రయించారు. వ్యవసాయశాఖ అంచనా ప్రకారం.. ఇప్పటికీ రైతుల వ ద్ద 25వేల టన్నుల సోయా పంట నిల్వ ఉంది. దీంతో పంటను కొనుగోలు చేయాలని అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళనబాట పడుతున్నారు.

రంగు మారిన సోయా..

గత వానాకాలంలో భారీ వర్షాలు కురవడంతో దిగుబడి చేతికి రావాల్సిన సమయంలో సోయా పంట కు నష్టం కలిగింది. దీంతో వేల క్వింటాళ్ల పంట రంగు మారింది. నాణ్యత ప్రమాణాల ప్రకారం.. తేమ 12శాతం లోపు, క్వింటాల్‌లో వ్యర్థ పదార్థాలు, ఇత ర గింజలు 2శాతం, దెబ్బ తగిలిన, పగిలిన, చీలిక గింజలు 15శాతం లోపు, రంగు మారిన గింజలు 5 శాతం లోపు, పరిపక్వం కాని నాసిరకం గింజలు 5 శాతం వరకు, పుచ్చిపోయినవి 3శాతం వరకు, ఇత ర గింజలు 3శాతం లోపు మాత్రమే ఉండాలి. ఇలా సోయా కొనుగోళ్లలో నాణ్యత ప్రమాణాలను మా ర్క్‌ఫెడ్‌ పాటిస్తూ వస్తోంది. ఇటీవల జిల్లాలోని బే ల, జైనథ్‌ మండలాల్లో కొనుగోలు చేసిన తర్వాత సెంట్రల్‌ వేర్‌ హౌస్‌ (సీడబ్ల్యూసీ) గోదాములకు దిగుబడి తరలించిన తర్వాత సరైన నాణ్యత లేదని అక్కడి నుంచి సుమారు 8వేల క్వింటాళ్లను మార్క్‌ఫెడ్‌ నుంచి రైతులకు తిరిగి పంపారు. దీనిపైనా రైతులు ప్రస్తుతం జిల్లాలో ఆందోళన చేపట్టారు. నాణ్యత గ్రేడ్‌ విషయంలో చొరవ తీసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

● కొనుగోలు కేంద్రాల మూసివేత ● రైతుల వద్దే 25 వేల టన్నుల1
1/2

● కొనుగోలు కేంద్రాల మూసివేత ● రైతుల వద్దే 25 వేల టన్నుల

● కొనుగోలు కేంద్రాల మూసివేత ● రైతుల వద్దే 25 వేల టన్నుల2
2/2

● కొనుగోలు కేంద్రాల మూసివేత ● రైతుల వద్దే 25 వేల టన్నుల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement