రహదారి భద్రత అందరి బాధ్యత
ఆదిలాబాద్‌టౌన్: జాతీయ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ దాసరి గంగారాం అన్నారు. 37వ జా తీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశిమందిర్‌లో రోడ్డు భద్రతపై బుధవారం అవగాహన సద స్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాలన్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలి పారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు రోడ్డు భద్రతా నియమాలను తెలియజేయాలని సూ చించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎ యిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అశోక్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఉమేష్‌రావు డోలె, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


