కాల్‌ చేసి.. కాజేస్తూ | - | Sakshi
Sakshi News home page

కాల్‌ చేసి.. కాజేస్తూ

Jan 8 2026 6:56 AM | Updated on Jan 8 2026 6:56 AM

కాల్‌ చేసి.. కాజేస్తూ

కాల్‌ చేసి.. కాజేస్తూ

పాత రూ.2ల నోట్‌కు రూ.32లక్షలు ఇస్తామని ఫేస్‌బుక్‌లో ఓ ప్రకటన వచ్చింది. ఆకర్షితుడైన తలమడుగుకు చెందిన ఓ వ్యక్తి సైబర్‌ కేటుగాళ్ల చేతిలో చిక్కి రూ.39వేలు నష్టపోయాడు.

స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేయాలంటూ ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఫోన్‌కు మెస్సేజ్‌ వచ్చింది. స్పందించిన అతడు విడతల వారీగా రూ.59వేలు నష్టపోయాడు.

ఉట్నూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో షాపింగ్‌ పేరిట ఆభరణాలు కొనుగోలు చేశాడు. అందుకోసం రూ.45వేలు చెల్లించాడు. అయితే ఎలాంటి ఆభరణాలు రాకపోవడంతో మోసపోయాడు.

తాను ఆర్మీ అధికారి అని, 50 శాతం డిస్కౌంట్‌కే వస్తువులు అందజేస్తానని ఓ కేటుగాడు నమ్మ బలికాడు. దీంతో ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి రూ.45వేలు చెల్లించి మోసపోయాడు.

అమాయకులే లక్ష్యంగా సైబర్‌ కేటుగాళ్ల వల ఉపాధి అవకాశాల పేరిట దోపిడీ లబోదిబోమంటున్న బాధితులు అవగాహన కల్పిస్తున్నా ఆగని కేసులు

నమోదైనవి ఎఫ్‌ఐఆర్‌లు అయిన కేసులు నగదు(రూ.లలో)

2024 726 108 106 24,44,171

ఆదిలాబాద్‌టౌన్‌: సైబర్‌ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులే లక్ష్యంగా వినూత్న రీతిలో మోసాలకు పాల్పడుతున్నారు. ఏఐ వీడియో మెస్సేజ్‌, సోషల్‌ మీడియా ఫ్రాడ్‌, లోన్‌ఫ్రాడ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌, బిజినెస్‌, జాబ్‌ ఫ్రాడ్‌, ఫేక్‌ కాల్స్‌, బ్లాక్‌మెయిలింగ్‌, డిజిటల్‌ అరెస్ట్‌, స్టాక్‌ మార్కెట్‌, యూపీఐ ఫ్రాడ్‌, ఏపీకే లింక్స్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్ట్రాగామ్‌లు హ్యాక్‌ చేయడం.. ఇలా అనేక రకాలుగా వల విసురుతున్నారు. జిల్లాలో వందల సంఖ్యలో కేసులు నమోదవుతుండగా, లక్షలాది రూపాయలను సైబర్‌ మోసగాళ్లు కొల్లగొడుతున్నారు. అయితే బాధితుల్లో విద్యావంతులే అధికంగా ఉండటం గమనార్హం. పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ చాలా మంది తెలిసి కూడా తప్పులు చేస్తున్నారనేది బహిర్గతమవుతోంది.

వల వేసి.. దోచుకోవడమే

సైబర్‌ కేటుగాళ్లు కాల్‌ చేసి బహుమతులు వచ్చాయని, కుటుంబ సభ్యులు ప్రమాదంలో ఉన్నారని నమ్మిస్తూ అమాయకుల నుంచి అందినకాడికి దోచేస్తున్నారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్ట్రాగామ్‌లను హ్యాక్‌ చేసి తమ పనులు కానిచ్చేస్తున్నారు. మనకు తెలియకుండానే మన అకౌంట్‌ నుంచి పలు సందేశాలు పంపి మనకు తెలిసిన వారి నుంచి డబ్బులు అడుగుతున్నారు. చిన్నపాటి టాస్క్‌ ఇచ్చి పూర్తవగానే కొంత డబ్బులు అకౌంట్‌లో జమ చేస్తారు. అలా నమ్మే వరకు రెండింతలు వేసి పెద్ద మొత్తంలో డబ్బులు వేసినప్పుడు ఉడాయిస్తారు.

పండుగల పేరిట..

పండుగలు, వివిధ సందర్భాల్లో సైబర్‌ కేటుగాళ్లు వినూత్న రీతిలో మోసాలకు పాల్పడుతున్నారు. హ్యాపీ న్యూ ఇయర్‌, హ్యాపీ దసరా, దీపావళి, సంక్రాంతి, రంజాన్‌, క్రిస్మస్‌ అంటూ మెస్సేజ్‌ రూపంలో లింక్‌లను పంపుతున్నారు. వాటిని ఓపెన్‌ చేసిన వారు తమ అకౌంట్‌ను ఖాళీ చేసుకోక తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మీ పిల్లలు డ్రగ్స్‌, దొంగతనం కేసుల్లో ఇరుక్కుపోయారు. వీడియో కాల్‌ చేయండి చూపిస్తామని చెప్పి పక్కనుంచి అరుపులు, ఏడ్పులు వినిపిస్తారు. వీడియో కాల్‌ చేసిన తర్వాత యూనిఫాం వేసుకొని మాట్లాడతారు. ఎఫ్‌ఐఆర్‌ కాపీని వాట్సాప్‌కు పంపి కేసు అయ్యిందని నమ్మిస్తారు. డబ్బులు వేస్తే విడిచిపెడతామని బెదిరిస్తారు. దీంతో పాటు నిరుద్యోగులకు టోకరా వేసేందుకు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ పేరిట జాబ్‌ ఉందని చెబుతారు. నెల వేతనం పంపిస్తారు. దీంతో నమ్మిన వారు స్నేహితులకు కూడా జాబ్‌ ఉందని చెబుతారు. అయితే వారి నుంచి రూ.30వేలను మోసగాళ్లు వారి ఖాతాల్లో వేయించున్న ఘటనలు సైతం జిల్లాలో చోటు చేసుకున్నాయి.

సైబర్‌ నేరాల వివరాలు..

నమ్మించి మోసం చేస్తారు..

సైబర్‌ నేరగాళ్లు రోజుకో పుంతలో మోసాలకు పాల్పడుతున్నారు. నమ్మించి మోసం చేస్తారు. సోషల్‌ మీడియా ద్వారా పరిచయమైన వారిని, అపరిచిత వ్యక్తులను ఎవరు నమ్మవద్దు. ఫేక్‌ పోలీస్‌, డిజిటల్‌ అరెస్ట్‌, ఇలా అనేక విధాలుగా బెదిరింపులకు పాల్పడతారు. డబ్బులు పోగొట్టుకున్న వెంటనే టోల్‌ఫ్రీ నం.1930కు సమాచారం అందించాలి. సమీపంలోని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. గోల్డెన్‌ ఆవర్‌లో ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బులు రికవరీ చేసే అవకాశం ఉంటుంది.

– ఎల్‌.జీవన్‌రెడ్డి, ఆదిలాబాద్‌ డీఎస్పీ

జిల్లాలో ఆగని మోసాలు..

సంవత్సరం వెబ్‌సైట్‌లో నమోదైన కోర్టు ద్వారా రికవరీ స్వాధీనం చేసుకున్న

2025 603 132 194 49,87,985

జిల్లాలో నిత్యం ఎక్కడో ఓ చోట సైబర్‌ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. కొంత మంది చెప్పుకోలేక కుమిలిపోతుండగా, మరికొంతమంది పో లీసులను ఆశ్రయిస్తుండడంతో వెలుగులోకి వస్తున్నాయి. సంఘటన జరిగిన వెంటనే 1930 టోల్‌ఫ్రీకి సమాచారం అందిస్తే డబ్బులు రికవరీ చేసే అవకాశం ఉంటుందని పోలీసులు సూచిస్తున్నా రు. గత రెండేళ్లుగా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన వారం రోజుల్లో 23 దాకా నమోదు కాగా రూ.6లక్షల వరకు బాధితులు నష్టపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement