మరింత బాధ్యతతో పనిచేయాలి
కై లాస్‌నగర్: అటవీ సంపద కొల్లగొడుతున్న వారికి కఠిన శిక్షలు పడేలా మరింత బాధ్యతతో పనిచేయాలని జిల్లా అటవీశాఖ అధికారి ప్ర శాంత్ బాజీరావు పాటిల్ అన్నారు. అటవీనేరా ల కేసుల్లో చార్జిషీట్ దాఖలు, కోర్టుల్లో సమర్పించడంపై జిల్లాలోని ఎఫ్‌ఆర్‌వోలు, ఎఫ్‌ఎస్ వోలు, బీట్ అధికారులు, క్లర్క్‌లు, కంప్యూటర్ ఆపరేటర్లకు స్థానిక టీటీడీసీలో బుధవారం శిక్షణ నిర్వహించారు. సీఐ ప్రేంకుమార్, జిల్లా కో ర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రహీం హాజరై ఆయా అంశాల్లో అటవీ అధికారులు పాటించాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ, అటవీ సంపదతో పాటు వన్యప్రాణులను కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని అన్ని అంశాలను పాటించాలని సూ చించారు. కార్యక్రమంలో జిల్లా శిక్షణ అటవీ అధికారి చిన్నబుసారెడ్డి , ఉట్నూర్ ఎఫ్‌డీవో అరవింద్, ఎఫ్‌ఆర్‌ఓ రాథోడ్ గులాబ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.


