నాగోబా జాతరలో పటిష్ట భద్రత
ఇంద్రవెల్లి: ఈ నెల 18నుంచి ప్రారంభం కానున్న కేస్లాపూర్ నాగోబా జాతరలో పటిష్ట భద్రత చర్యలు చేపట్టనున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి ఉట్నూర్ ఏఎస్పీ కాజ ల్‌సింగ్‌తో కలిసి నాగోబా ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం జాతర ఏర్పాట్లు, పో లీస్ క్యాంప్, పోలీసులకు కల్పించే సౌకర్యాలను ప రిశీలించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా, ట్రా ఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పార్కింగ్, రూట్, సీసీ కెమెరాల ఏర్పాటుపై సమీక్షించారు. శిక్షణ ఐపీఎస్ రాహుల్‌కాంత్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ శ్రీనివాస్, ఉట్నూర్ సీఐ ప్రసాద్, ఎస్సై సాయన్న తదితరులున్నారు.


