అంకితభావంతో పనిచేయాలి
ఆదిలాబాద్‌టౌన్: అంకితభావంతో విధులు ని ర్వర్తించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించా రు. తెలంగాణ స్పెషల్ పోలీస్ నుంచి ఏఆర్ వి భాగానికి కన్వర్షన్‌పై నియమితులైన 11మంది కానిస్టేబుళ్లు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశా రు. వీరిలో 2012, 2013 బ్యాచ్‌లకు చెందిన 2వ బెటాలియన్ నుంచి ఏడుగురు, మూడో బెటాలియన్ నుంచి ఒకరు, 15వ బెటాలియన్ నుంచి ముగ్గురున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ వీరికి శుభాకాంక్షలు తెలిపారు. అత్యవసర పరి స్థితులు, వీఐపీ సందర్శనలు, బందోబస్తు వి ధులు, ప్రత్యేక ఆపరేషన్లు, ప్రజాభద్రతకు సంబంధించిన విధులను పకడ్బందీగా నిర్వర్తించాలని సూచించారు. రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు వెంకటి, సీసీ కొండరాజు, సిబ్బంది పాల్గొన్నారు.


