రాష్ట్రస్థాయి కుంగ్‌ఫూ, కరాటే పోటీల్లో సత్తా
బెల్లంపల్లి: చెన్నూర్‌లో ఈనెల 4న జరిగిన రాష్ట్రస్థాయి కుంగ్‌ఫూ, కరాటే పోటీల్లో బెల్లంపల్లికి చెందిన ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ (సీవోఈ) పాఠశాల /కళాశాల తైక్వాండో విద్యార్థులు సత్తా చాటారు. కలర్ బెల్ట్ విభాగంలో అర్జున్ ప్రసాద్ గోల్డ్‌మెడల్, ఏ.శ్రీమన్ సిల్వర్, మనోజ్ బ్రాంజ్‌మెడల్ సాధించారు. బ్రౌన్‌బెల్ట్ మహిళల విభాగంలో ఇప్ప శ్రావణి గోల్డ్‌మెడల్ గెలుచుకోగా, బ్లాక్ బెల్ట్ విభాగంలో శ్వేత సిల్వర్, పురుషుల విభాగంలో బి.మనోజ్ గోల్డ్‌మెడల్ గ్రాండ్ చాంపియన్ షిప్ కై వసం చేసుకున్నట్లు తైక్వాండో జిల్లా అధ్యక్షుడు సిద్దమల్ల చిరంజీవి, కార్యదర్శి బోగే రాజేష్ తెలిపారు. చెన్నూర్ సీఐ దేవేందర్ రావు విజేతలకు బహుమతి అందజేశారు. పతకాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ విజయ్ సాగర్ అభినందించారు.


