ముగిసిన క్రీడాశిక్షణ శిబిరాలు
ఉట్నూర్‌రూరల్: రాష్ట్రస్థాయి గిరిజన క్రీడోత్సవాల్లో పాల్గొనే ఐటీడీఏ ఆశ్రమ పాఠశాల క్రీడాకారుల శిక్షణ శిబిరాలు సోమవారం ముగిశాయి. అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఆర్చరీ, టెన్నికాయిడ్, చెస్, క్యారమ్స్ క్రీడాంశాల్లో బాల,బాలికలకు స్థానిక కేబీ ప్రాంగణంలోని 18 రోజుల శిక్షణ కొనసాగింది. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ మొత్తం 248 మందికి క్రీడాదుస్తులు, షూ పంపిణీ చేశారు. శిక్షణ శిబిరాలు విజయవంతంగా నిర్వహించిన పీడీ, పీఈటీలు, కోచ్‌లను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, ఏటీడీవో సదానందం, ప్రధానోపాధ్యాయులు ఉత్తం, సీనియర్ పీడీలు హేమంత్, రవీందర్, జైవంత్, జల్పతి, మధుసూదన్, నాని, కృష్ణ, పాండు, కీర్తి తదితరులు పాల్గొన్నారు.


