కేయూ బ్యాడ్మింటన్ కెప్టెన్‌గా మిమ్స్ విద్యార్థిని
మంచిర్యాలఅర్బన్: కాకతీయ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ కెప్టెన్‌గా మిమ్స్ డిగ్రీ కళాశాల విద్యార్థిని ఆశ్విత ఎంపికై ంది. ఈనెల 6 నుంచి రాజమండ్రి గన్ని సుబ్బాలక్ష్మీ యూనివర్సిటీలో నాలుగు రోజుల పాటు జరిగే సౌత్‌జోన్ బ్యాడ్మింటన్ పోటీలకు కేయూ నుంచి మిమ్స్‌లో బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్న ఆశ్విత కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. యూనివర్సిటీ జట్టుకు మూడోసారి వరుసగా ఎంపికై న విద్యార్థిని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరాజు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్‌రావు, డైరెక్టర్ విజయ్‌కుమార్, పీడీ నూనె శ్రీనివాస్ అభినందించారు.
జూనియర్ అసిస్టెంట్లకు పదోన్నతి
కై లాస్‌నగర్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రెవె న్యూ శాఖలో పనిచేస్తున్న 12 మంది జూ నియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించింది. ఈమేరకు సీసీఎల్‌ఏ సె క్రెటరీ ఎం.మకరంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎస్.అశ్విని, ఆర్.సునీత, ఎండీ జమ, సాయికృష్ణ, ఏ.రమేశ్‌లకు పదోన్నతి కల్పిస్తూ ఆ జిల్లాకు కేటాయించారు. ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన గౌరంగ్ మండల్ అభిజ్ఞ శ్రీజ, అనిత దుర్గంను ఆ జిల్లాకు కేటాయించారు. మంచిర్యాలలో పనిచేస్తున్న కె.రాజమణి, టి.విద్యబానులను పదోన్నతి కల్పిస్తూ ఆసిఫాబాద్ జిల్లాకు కేటాయించారు.
పటిక బెల్లం విక్రయిస్తున్న ముగ్గురిపై కేసు
ఉట్నూర్‌రూరల్: పటిక బెల్లం విక్రయిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఉట్నూర్ సీఐ మడావి ప్రసాద్ తెలిపారు. మండల కేంద్రంలో సోమవారం 2 కిలోల పటిక బెల్లం విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. విక్రయాలు, కొనుగోలు చేస్తున్న సేవదాస్‌నగర్‌కు చెందిన గుమ్ముల రాజ్‌కుమార్, నాగాపూర్, గంగాపూర్ గ్రామాలకు చెందిన పౌడే సిద్దేశ్వర్, గంగారెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గుడుంబా తయారీ కోసం ఉపయోగించే పటిక నల్లబెల్లం విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.
జీవాల ఎరువు.. పంటకు మేలు
దండేపల్లి: భూసారం పెంచేందుకు మూగజీవాల ఎరువులు ఎంతగానో ఉపయోగపడతాయి. గొర్రెలు, మేకలు, కోళ్లు, కంపోస్టు, సేంద్రియ ఎరువులకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. వీటి ద్వారా పంటల దిగుబడి సాధించవచ్చు. రసాయన ఎరువుల వాడకంతో భూసారం దెబ్బతింటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా రైతులు జీవాల ఎరువులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వరి కోతలు పూర్తవగానే కొందరు రైతులు తమ పంట పొలాల్లో కొన్నిరోజులపాటు, గొర్రెల మందలు పెట్టిస్తారు. వరి కోతలు పూర్తయిన పొలాల్లో మూగజీవాలు మేపడం ద్వారా వాటి విసర్జకాలు పొలంలో పడటంతో భూసారం పెరుగుతుంది. గొర్రెల పేడలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది మొక్క వేర్లు భూమి లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు ఉపయోగపడుతుందని దండేపల్లి ఏవో గొర్ల అంజిత్‌కుమార్ తెలిపారు. సేంద్రియ ఎరువులతో కలిగే లాభాలను రైతులకు వివరించారు. పశువులు, గొర్రెల ఎరువును పొలంలో వేయడం ద్వారా భూసారం పెరుగుతుందన్నారు. తద్వారా రసాయన ఎరువుల వాడకం తగ్గించుకోవచ్చు. దీంతో ఎరువుల కొనుగోలు ఖర్చును కొంత మేర ఆదా చేసుకోవచ్చునని అన్నారు. రైతులు ఏటా పంట పొలాల్లో రసాయనిక ఎరువులకు బదులుగా జీవాల పేడను వినియోగించడం ద్వారా భూ మి సమతుల్యత పెరుగుతుందన్నారు. నీటి త డులు తట్టుకునే శక్తిని ఇస్తుందని పేర్కొన్నారు.
కేయూ బ్యాడ్మింటన్ కెప్టెన్‌గా మిమ్స్ విద్యార్థిని


