రెవెన్యూ వర్సెస్ ఫారెస్ట్
సాత్నాల: రెవెన్యూ, ఫారెస్ట్ అధికారుల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ సమస్య ఎటూ తేలడం లేదు. వీరి తీరుతో అమాయక గిరిజనులకు ఇబ్బందులు తప్పడం లేదు. సాత్నాల మండలం దుబ్బగూడకు చెందిన ఆత్రం లేతుబాయి ఆ గ్రామంలోని గిరిజనులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కోసం ఎకరం భూమి విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రజాప్రతినిధులతోపాటు జిల్లా ఉన్నతాధికారులు ఆమెను అభినందించి సత్కరించారు. అయితే దాత ఇచ్చిన భూమి ఫారెస్ట్ పరి ధిలో ఉందని ఆ శాఖ అధికారులు చెబుతుండగా, రెవెన్యూ అధికారులు తమ పరిధిలోకి వస్తుందని పేర్కొంటున్నారు. అటవీ అధికారులు అడ్డుకోవడంతో పునాది దశ పూర్తి చేసుకున్న నిర్మాణాలు ఆగిపోయాయని గిరిజనులు వాపోతున్నారు. సోమవారం పలువురు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆ దిలాబాద్ ఆర్డీవో స్రవంతి, ఎఫ్‌ఆర్వో గులాబ్ సింగ్‌లు గ్రామాన్ని సందర్శించి గిరిజనులతో మాట్లాడారు. వివాదాస్పదంగా ఉన్న ఈ స్థలాన్ని వదిలేసి మరోచోట నిర్మాణాలు చేపట్టాలని, ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని సూచించగా ఇందుకు వా రు ససేమిరా అన్నారు. నిరక్ష్యరాసులైన తమ నుంచి అధికారులు బలవంతంగా సంతకాలు సేకరించినట్లు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆర్డీవో తిరి గివెళ్తుండగా బాధితులు వాహనాన్ని అడ్డుకున్నారు. తమకు న్యాయం చేసి ఇక్కడి నుంచి వెళ్లాలని కోరారు. చివరకు ఈ వివాదం ఎటూ తేలకుండా పోయింది. తమకు న్యాయం జరగకపోతే ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి, కలెక్టరేట్ ఎదుట ఆందోళనలు చేపడతామని బాధిత గిరిజనులు పేర్కొన్నారు.


