పంట మార్పిడితోనే అధిక దిగుబడి
భీంపూర్: పంట మార్పిడితోనే అధిక దిగుబడి సా ధ్యమని జిల్లా వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ రాజేందర్‌రెడ్డి, రఘువీర్, అనిల్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని అందర్‌బంద్ గ్రామంలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు రైతులతో సమావేశమై మాట్లాడారు. పంటల సాగులో రసాయన ఎరువులు తగ్గించి, సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని సూచించారు. విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేసే సమయంలో దుకాణాదారుల నుంచి రసీదులు తీసుకోవాలని తెలిపారు. పంటకాలం పూర్తయ్యేదాకా రసీదులు భద్రపరుచుకోవాలని రై తులకు సూచించారు. కార్యక్రమంలో ఏవో శ్రీనివా సరెడ్డి, ఏఈవో శంకర్ తదితరులు పాల్గొన్నారు.


