ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలి
ఆదిలాబాద్‌టౌన్: పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని డీఈవో ఏనుగు శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన మూడురోజుల ఎన్‌రోల్‌మెంట్ ప్రచార జాత కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, అన్ని రకాల సౌకర్యాలు కల్పి స్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించేందుకు టీఎస్ యూటీఎఫ్ కృషి అభినందనీ యమని కొనియాడారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్, సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే కిష్టన్న, వీ అశోక్, జిల్లా ఉపాధ్యక్షుడు టీ సూర్యకుమార్, కోశాధికారి కే శ్రీనివాస్, జిల్లా కార్యదర్శులు ఎ.స్వామి, ఎ.ఇస్తారి, జిల్లా కమిటీ సభ్యులు, మండలాల బాధ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


