ఆ సైలెన్సర్లు వాడొద్దు
● ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌టౌన్: వాహనాలకు మోడిఫైడ్ సైలెన్సర్లు బిగించడంతో చిన్నారులు, వృద్ధులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటిని వాడిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. నెలరోజుల పాటు జిల్లా కేంద్రంలో స్పెషల్‌డ్రైవ్ నిర్వహించి సీజ్ చేసిన 160 మోడిఫైడ్ సైలెన్సర్లను జిల్లా కేంద్రంలోని టూటౌన్ పోలీసు స్టేషన్ ఎదుట మంగళవారం రోడ్‌రోలర్‌తో తొక్కించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను వాహనాలకు బిగించవద్దని, కంపెనీ సైలెన్సర్లను మాత్రమే వాడాలని సూచించారు. ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై ఇకనుంచి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే మెకానిక్‌లు వాహనాలకు మోడిఫైడ్ సెలెన్సర్లు బిగించవద్దని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి, వన్‌టౌన్, టూటౌన్ సీఐలు సునిల్‌కుమార్, కరుణాకర్‌రావు, ట్రాఫిక్ సీఐ ప్రణయ్‌కుమార్, ఎస్సైలు మహేందర్, దేవేందర్, సిబ్బంది రాజేశ్, రామకృష్ణ, రమేశ్, ఫేరోజ్, విజయ్, సతీష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.


