ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
● ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌టౌన్: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్ర తి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్‌లో బి సేఫ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. ద్విచక్ర వాహనదారులు బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూ చించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్‌రెడ్డి, వన్‌టౌన్, ట్రాఫిక్ సీఐలు సునిల్ కుమార్, ప్రణయ్ కుమార్, మహిపాల్ రెడ్డి, అమూల్ ఓజ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అనంతరం జిల్లా కేంద్రంలోని కుమురంభీం చౌక్‌లో సంస్థ ద్వారా హెల్మెట్ ప్రాముఖ్యతపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ఎస్పీ చేతుల మీదు గా 30 మందికి ఉచితంగా హెల్మెట్లు అందజేశారు. అనంతరం సంతకాల సేకరణ చేపట్టారు.
వాహనాల నిర్వహణ తప్పనిసరి
వాహనాల నిర్వహణ క్రమం తప్పకుండా చేపట్టా లని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీసు హెడ్‌క్వార్టర్‌లోని సమావేశ మందిరంలో పోలీసు వాహ న అధికారులు, డ్రైవర్లకు మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్టేషన్లలో డ్రైవర్లు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా చూడాలన్నారు. సమావేశంలో రిజర్వు ఇన్‌స్పెక్టర్ వెంకటి, ఎంటీఓ మురళి తదితరులు పాల్గొన్నారు.


