రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
● ఇద్దరికి తీవ్రగాయాలు
తానూరు/భైంసాటౌన్: తానూరు మండలంలోని భోసి వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని నాంద గ్రామానికి చెందిన చందు (50), హన్మంతు, బాబన్న(సుదర్శన్) భైంసా వైపు నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా భోసి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. చందు తలపై నుంచి వాహనం వెళ్లడంతో తలభాగం నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందాడు. హన్మంతు, బాబన్నకు తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు అంబులెన్స్‌లో భైంసాలోని ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. హన్మంతు పరిస్థితి విషమంగా ఉండడంతో నాందేడ్‌కు తరలించగా, బాబన్న భైంసా ఏరియాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతు
లక్ష్మణచాంద: ఈతకు వెళ్లి విద్యార్థి గల్లంతైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు వడ్యాల్ గ్రామానికి చెందిన మద్దెల గంగన్న–లక్ష్మి దంపతుల కుమారుడు రామ్‌చరణ్ (14) శనివారం ఉదయం పాఠశాలకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఒంటిగంట సమయంలో కాలనీ పిల్లలతో కలిసి గ్రామ సమీపంలోని చెక్ డ్యాంకు స్నానానికి వెళ్లారు. సాయంత్రమైనా తమ కుమారుడు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఆరా తీయగా ఈతకు వెళ్లినట్లు తెలిసింది. దీంతో చెక్‌డ్యామ్ వద్దకు వెళ్లి చూడగా రామ్‌చరణ్ బట్టలు, పాదరక్షలు కనిపించాయి. చీకటి కావడంతో తిరిగి ఇంటికి వచ్చినట్లు కాలనీవాసులు తెలిపారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్‌కు సైకిల్‌యాత్ర
నేరడిగొండ: బెంగళూరుకు చెందిన కొట్రెస్ సోలార్ ద్వారా నడిచే సైకిల్‌పై కన్యాకుమారి నుంచి కశ్మీర్‌కు యాత్ర చేపట్టాడు. శనివారం నేరడిగొండ మండలంలోని రోల్‌మామడ టోల్‌ప్లాజ్ వద్ద అతను హైవే పెట్రోలింగ్ పోలీసులకు కనిపించగా పలు సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 100కు కాల్ చేయాలని, వెంట ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఉంచుకోవాలని సూచించారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం


