విభిన్న తీర్పు! ప్రస్తుత ఎన్నికల ట్రెండ్‌పై సర్వత్రా ఆరా..

- - Sakshi

గతంలో పొత్తులు.. ఆసక్తికర ఫలితాలు!

ఉమ్మడి జిల్లా రిజల్ట్స్‌పై అందరి దృష్టి..

సాక్షి, ఆదిలాబాద్‌: శాసనసభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీదే ఉమ్మడి జిల్లాలో హవా కొనసాగుతుందా..! లేని పక్షంలో అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. అన్నట్లు ప్రతిపక్షాలు అధిక స్థానాల్లో నెగ్గుతాయా.. లేకపోతే అన్ని ప్రధాన పార్టీల ప్రభావం ఉంటుందా.. గతంలో మాదిరి ఇతర పార్టీలు కూడా ఏదైనా ఉనికి చాటుతాయా అనేది సర్వత్రా చర్చనీయాశంగా మారాయి.

గత రెండు ఎన్నికల్లో ఇలా..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు.. 2014 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌(అప్పటి టీఆర్‌ఎస్‌) ప్రభుత్వం ఏర్పడింది. ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒంటరిగా పోటీ చేయగా, బీజేపీ, టీడీపీ పొత్తులతో బరిలోకి దిగాయి. ఆ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ఏడు స్థానాల్లో గెలు వగా, అనూహ్యంగా నిర్మల్‌లో అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సిర్పూర్‌లో కోనేరు కోనప్ప బహుజన్‌ సమా జ్‌ పార్టీ ఏనుగు గుర్తుపై విజయం సాధించారు.

ముథోల్‌లో కాంగ్రెస్‌ నుంచి విఠల్‌రెడ్డి ఏకై క స్థా నంలో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో అధి కా రంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లాలోనూ ప్ర భావం చూపినప్పటికీ పూర్తి స్థానాలను సాధించలేకపోయింది. అయితే ఐకేరెడ్డి, కొనప్ప, విఠల్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరడంతో అప్పుడే సంఖ్య పెరిగింది. 2018లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో తిరిగి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెలిసిందే.

ఉమ్మడి జిల్లాలో ఏకంగా తొమ్మిది స్థానాల్లో ఈ పార్టీ విజయకేతనం ఎగరవేయగా, ఒక్క ఆసిఫాబా ద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుపొందడం ద్వారా ఆ పార్టీ ఉనికి చాటారు. ఆ తర్వాత ఆయన కూడా బీఆర్‌ఎస్‌లో చేరడంతో ఉమ్మడి జిల్లా పూర్తి గా గులాబీమయం అయింది. ఇలా ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీకే ఉమ్మడి జిల్లాలోనూ ప్రజలు పట్టం కట్టారు.

అంతకు ముందు ఎన్నికల్లో ఇలా..
సమైక్య రాష్ట్రంలో జరిగిన 2004, 2009 ఎన్నికల సరళిలో భిన్నమైన ఫలితాలు ఉన్నాయి. 2004లో ఉమ్మడి ఆదిలాబాద్‌లో తొమ్మిది శాసనసభ నియోజకవర్గాలు ఉండగా, ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కాగా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ ఐదుస్థానాల్లో, బీఆర్‌ఎస్‌ మూడు స్థానాల్లో, టీడీపీ ఒక స్థానంలో గెలుపొందాయి. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, సీపీఐ, సీపీఎం పార్టీ లు కలిసి పోటీ చేశాయి.

తద్వారా ఉ మ్మడి జిల్లాల ఫలితాల పరంగా రాష్ట్రంలో అధికా రంలోకి వచ్చిన పార్టీలనే జనం ఆదరించారు. ఇక 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా బెల్లంపల్లి నియోజకవర్గం ఏర్పాటుతో ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 10కి పెరిగింది. అప్పుడే లక్సెట్టిపేట నియోజకవర్గం మంచిర్యాలగా మార్పు జరిగింది. ఈ ఎన్నికల్లో జిల్లా పరంగా భిన్నమైన ఫలితాలు చోటు చేసుకున్నాయి.

ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీ, బీఆర్‌ఎస్‌లు మహాకూటమిలో చేరి పోటీ చేశాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగా ఉమ్మడి ఆదిలా బాద్‌ జిల్లాలో మాత్రం కాంగ్రెస్‌ ఒకే ఒక స్థానం ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు గెలిచారు. టీడీపీ నాలుగు, బీఆర్‌ఎస్‌ మూడు స్థానాల్లో గెలు పొందగా, అనూహ్యంగా నిర్మల్‌లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక మిగిలిన స్థానం బెల్లంపల్లిలో సీపీఐ నుంచి గుండా మల్లేశ్‌ గెలుపొందారు. ఇలా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో భిన్నమైన ఫలితాలు కనిపించాయి.

Read latest Adilabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

12-11-2023
Nov 12, 2023, 02:42 IST
సాక్షి, హైదరాబాద్‌: ‘కమ్యూనిస్టులను కేసీఆర్‌ దూరం పెట్టడానికి ప్రధాన కారణం బీజేపీకి భయపడటమే. ఒకవేళ పొత్తు కుదిరితే కమ్యూనిస్టులు ఒకే...
12-11-2023
Nov 12, 2023, 00:56 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల్లోనూ సీఎం కేసీఆర్‌కు ఓటమి తప్పదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర...
12-11-2023
Nov 12, 2023, 00:49 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ రాష్ట్రంలో వరుస పర్యటనలు చేపడుతున్నారు. ఇప్పటికే ఈ నెల...
11-11-2023
Nov 11, 2023, 21:06 IST
గజ్వేల్‌లో రకరకాలుగా తమ నిరసన తెలిపే క్రమంలో బాధితులంతా కేసీఆర్‌పై పోటీకి దిగారు. వాళ్లలో ధరణి బాధితులు.. 
11-11-2023
Nov 11, 2023, 17:56 IST
‘‘మా సామాజిక వర్గానికి ధైర్యం చెప్పడానికి వచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. 
11-11-2023
Nov 11, 2023, 17:35 IST
బీఆర్‌ఎస్‌ అంటే పంట కోతలు.. కాంగ్రెస్‌ అంటే కరెంట్‌ కోతలు.. 
11-11-2023
Nov 11, 2023, 15:10 IST
సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై మంత్రి తలసాని యాదవ్‌ మండిపడ్డారు. రేవంత్‌ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని విమర్శించారు....
11-11-2023
Nov 11, 2023, 13:22 IST
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నామినేషన్ల చివరి రోజు శుక్రవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్‌, బీజేపీ పలుచోట్ల అభ్యర్థులను...
11-11-2023
Nov 11, 2023, 12:40 IST
సాక్షి, మెదక్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాష్ట్ర ప్రజలకు నమ్మకం ఉందని, కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆగమవుతారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు....
11-11-2023
Nov 11, 2023, 12:17 IST
సాక్షి, కుమరం భీం: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే.. బీఆర్‌ఎస్‌కు వేసినట్లే అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి...
11-11-2023
Nov 11, 2023, 11:24 IST
ఎన్నికల నామినేషన్‌లో భాగంగా ఆయా పార్టీల అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్‌లలో తమ ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎన్నికల...
11-11-2023
Nov 11, 2023, 09:27 IST
సాక్షి: రాబోయే తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ప్రజా ప్రయోజనార్ధం సాక్షి మీడియా గ్రూప్ ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. తెలంగాణ ఓటర్లను...
11-11-2023
Nov 11, 2023, 07:57 IST
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయా లని ఆశించి టికెట్‌ రాక భంగపడిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలను ఏఐసీసీ...
11-11-2023
Nov 11, 2023, 07:38 IST
సాక్షి, ఆదిలాబాద్‌: కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడ్డ అల్లూరి సంజీవ్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. శుక్రవారం ఆయన...
11-11-2023
Nov 11, 2023, 07:02 IST
ఖమ్మం: ఉమ్మడి జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు తొలిసారిగా కారు గుర్తుపై బరిలోకి దిగుతున్నారు. వీరిలో కొందరు గత ఎన్నికల్లో కాంగ్రెస్‌, టీడీపీ...
11-11-2023
Nov 11, 2023, 06:50 IST
హైదరాబాద్: శేరిలింగంపల్లి నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మారబోయిన రవికుమార్‌ యాదవ్‌ స్థిరచరాస్తుల విలువ అక్షరాల రూ.151 కోట్లకు పైమాటే. అప్పు...
11-11-2023
Nov 11, 2023, 06:35 IST
సూర్యాపేట : బీఆర్‌ఎస్‌ సూర్యాపేటఅభ్యర్థి, రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి గురువారం వేసిన నామినేషన్‌లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు....
11-11-2023
Nov 11, 2023, 05:32 IST
సాక్షి, హైదరాబాద్‌: నామినేషన్ల దాఖలు చివరిరోజు అభ్యర్థుల జాబితాలో కొన్ని మార్పులు చేసి, ఇదివరకే ప్రకటించిన వారికి బీఫాంలు ఇవ్వకపోవడం...
11-11-2023
Nov 11, 2023, 05:23 IST
సిర్పూర్‌(టి)/కౌటాల, సిరిసిల్ల: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనని, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎన్నికల ఖర్చును బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆరే పెడుతున్నారని...
11-11-2023
Nov 11, 2023, 05:15 IST
సాక్షి, న్యూఢిల్లీ:  అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల చివరి రోజున బీజేపీ అధిష్టానం విడుదల చేసిన పార్టీ అభ్యర్థుల ఐదో జాబితా... 

Read also in:
Back to Top