తాగుడుకు బానిసై యువకుడి ఆత్మహత్య! | Sakshi
Sakshi News home page

తాగుడుకు బానిసై యువకుడి ఆత్మహత్య!

Published Fri, Sep 8 2023 2:00 AM

- - Sakshi

ఆదిలాబాద్‌: మద్యానికి బానిసై యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని మాకోడ గ్రామంలో గురువారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం... రకాడే సందీప్‌(33) కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు.

మద్యం మానుకోవాలని మృతుడి తండ్రి రకాడే కారేబా, భార్య ఆశ తరుచుగా చెబుతున్నప్పటికీ మారడం లేదు. బుధవారం సైతం రాత్రి తాగి ఇంటికి వచ్చిన సందీప్‌ను కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో కోపంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన సందీప్‌ గుర్తు తెలియని పురుగుల మందు తాగి అర్ధరాత్రి ఇంటికి వచ్చి వాంతులు చేసుకోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కి తరలించారు.

చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు.

 
Advertisement
 
Advertisement