కనకదుర్గమ్మకు చీర, సారె
ఉరేగింపుగా తరలి మొక్కులు చెల్లించుకున్న భక్తులు
అమలాపురం రూరల్: గాంధీనగర్‌లో కొలువైన కనకదుర్గమ్మ తల్లి ఆలయ 30వ వార్షికోత్సవం సందర్భంగా మాఘమాసం ఆదివారం భక్తులు అమ్మవారికి చీర, సారె సమర్పించారు. వేలాదిగా మహిళలు సారెను నెత్తిన మోస్తూ ఊరేగింపుగా తీసుకువెళ్లారు. వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రారంభించిన ఊరేగింపు అమ్మవారి ఆలయం వరకు సాగింది. ఆలయ అర్చకుడు రామేశ్వరవరపు రామప్రసాద్ అధ్వర్యంలో అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి సమర్పించిన సారె, ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ తిక్కిరెడ్డి ఆదినారాయణ అధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు ప్రసాదాలు, గాజులు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన అన్నసమారాధనలో వేలాది భక్తులు పాల్గొన్నారు.
కనకదుర్గమ్మకు చీర, సారె


