
ఆదిలాబాద్: దండేపల్లి మండలంలోని ఇప్పలగూడెం గ్రామానికి చెందిన డ్రైవర్ ఆత్రం అంజి(20) ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడి సోమవారం మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం..రెబ్బనపల్లి శివారులోని పొలంలో కేజీవీల్స్ ట్రాక్టర్‌తో జంబు కొడుతుండగా, ప్రమాదవశాత్తు పొలంలో బోల్తాపడింది.
ట్రాక్టర్ ఇంజిన్ కింద బురదలో ఇరుక్కున్న అంజి అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ విషయమై ఎస్సై ప్రసాద్‌ను సంప్రదించగా, ఫిర్యాదు అందలేదు. మృతదేహాన్ని ప్రమాద స్థలం నుంచి లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించామని పేర్కొన్నారు.