రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్రగాయాలు
గుడిహత్నూర్:మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారి–44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్రగా యాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బజార్‌హత్నూర్ మండలంలోని భు తాయికి చెందిన పడ్వాల్ పూర్ణబాయి జాతీయ రహదారి దాటుతుండగా వేగంగా వచ్చిన మోటార్ సైకిల్ ఢీకొట్టింది. దీంతో ఆమె ఎడమకాలు విరిగి తీవ్రగాయాలయ్యాయి. ఆమెతోపాటు మహారాష్ట్రకు చెందిన ద్విచక్రవాహనదారుడు సోహిల్ గాయాలపాలయ్యాడు. వీరి ని చికిత్స కోసం హైవే అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరలించారు. పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.


