మనస్తాపంతో ఒకరి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో ఒకరి ఆత్మహత్య

Feb 11 2026 7:34 AM | Updated on Feb 11 2026 7:34 AM

మనస్తాపంతో ఒకరి ఆత్మహత్య

మనస్తాపంతో ఒకరి ఆత్మహత్య

ఇంద్రవెల్లి: పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని హర్కపూర్‌తండాలో చోటు చేసుకుంది. ఎస్సై సాయన్న, మృతుడి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్కపూర్‌తండా గ్రామానికి చెందిన జాదవ్‌ వెంకటేశ్‌ (30) వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలంగా అతడు మద్యానికి బానిసయ్యాడు. భార్య సంగీత, కుటుంబ సభ్యులు నచ్చజెప్పినా మారలేదు. ఈ నెల 5న మద్యం తాగి ఇంటికి వచ్చిన వెంకటేశ్‌ను కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై మద్యం మత్తులో పురుగుల మందు తాగి సమీప బంధువైన జాదవ్‌ గోవింద్‌కు ఫోన్‌ ద్వారా విషయం తెలిపాడు. గోవింద్‌ ఇచ్చిన సమాచారం మేరకు పంటచేనుకు వెళ్లి చూడగా వెంకటేశ్‌ స్పృహ కోల్పోయి ఉన్నాడు. వెంటనే అతడిని ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి భార్య సంగీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్యతోపాటు కొడుకు సాయికుమార్‌, కూతురు కృష్ణవేణి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement