తల్లి ఒడికి చేరిన చిన్నారి
ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్ ఆస్పత్రిలో ఒంటరిగా కనిపించిన రెండేళ్ల చిన్నారిని గుర్తించి మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో తల్లికి అప్పగించినట్లు టూ టౌన్ సీఐ నాగరాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 4న రిమ్స్ ఆస్పత్రి ప్రాంగణంలో రెండేళ్ల చిన్నారి ఏడుస్తూ కనిపించింది. సెక్యూరిటీ గార్డు అమీర్ అవుట్‌పోస్ట్ పోలీసులు రవీందర్‌రెడ్డి, అబీదుల్లా హుస్సేన్, ఐటీడీఏ హెల్ప్‌డెస్క్ ఉద్యోగి బలిరామ్‌కు సమాచారం అందించా డు. విషయం తెలుసుకున్న డీసీపీవో రాజేంద్రప్రసా ద్, చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది రిమ్స్‌కు చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం ఆ చిన్నారిని శిశుగృహకు తరలించారు. ఇదే సమయంలో మహారాష్ట్రలోని మాండ్వి ప్రాంతానికి చెందిన భారతి తన కుమార్తె అకీరాను వెతుకుతూ ఆదిలాబాద్‌కు చేరుకుంది. విషయం తెలుసుకున్న డీసీపీవో సిబ్బంది టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి శిశుగృహలో ఉన్న పాపను తల్లి వెతుకుతున్నట్లు నిర్ధారించారు. అనంతరం శిశుగృహ మేనేజర్ విజయలక్ష్మి సమక్షంలో చిన్నారిని తల్లికి అప్పగించినట్లు సీఐ వివరించారు.


