మెగా జాబ్‌మేళాకు స్పందన
ఉట్నూర్‌రూరల్: మండల కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్‌లోగల వైటీసీలో ఐటీడీఏ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు స్పందన లభించింది. మేళాకు 312 మంది హాజరుకాగా 133 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ తెలిపారు. అంతకుముందు ఇటీవల జిల్లా స్థాయిలో ప్రేరణ బాలికల క్రీడా పో టీల్లో ఓవరాల్ ఛాంపియన్ షిప్‌తోపాటుగా ఇతర క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను తన చాంబర్‌లో అభినందించారు. కార్యక్రమాల్లో ఐటీడీఏ డీడీ అంబాజీ, ట్రైబల్ స్పోర్ట్స్ ఆఫీసర్ పార్థసారథి, వైటీసీ జేడీఎం నాగభూషణం, హార్టికల్చర్ ఆఫీసర్ సందీప్‌కుమార్, ఏసీఎంవో జగన్ తదితరులున్నారు.


