గాయపడిన అరుదైన గుడ్లగూబ
కౌటాల: మండల కేంద్రానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో మంగళవారం అరుదైన గుడ్లగూబను అటవీశాఖ అధికారులు రక్షించి చికిత్స అందించారు. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన సమయంలో స్థానికుడు పందిర్ల శ్రీనివాస్ గాయపడిన పక్షిని గమనించి అటవీ సెక్షన్ అధికారి తులసీదాస్, బీట్ అధికారి శ్రీదేవికి సమాచారం ఇచ్చారు. దీంతో స్పందించిన అటవీ అధికారులు ఎఫ్‌ఆర్వో ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు వెంటనే గుడ్లగూబను పశువైద్యశాలకు తరలించిన చిక్సిత అందించారు. కాగజ్‌నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఏడు రకాల గుడ్లగూబ జాతులున్నాయని, గాయపడిన గుడ్లగూబను బార్ ఓల్ (చంద్రముఖ గుడ్లగూబ)గా పిలుస్తారని ఎఫ్‌ఆర్వో ప్రవీణ్‌కుమార్ తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణకు అందరూ సహకరించాలని కోరారు. గాయపడిన పక్షిని గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చిన శ్రీనివాస్ ఆయన అభినందించారు.


