Usman Tariq
-
బుమ్రాతో పోల్చడానికి సిగ్గుండాలి!
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సెలెక్టర్ ఆకిబ్ జావేద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను పాక్ వివాదాస్పద బౌలర్ ఉస్మాన్ తారిఖ్‌తో పోల్చడం క్రికెట్లో చర్చనీయాంశంగా మారింది. శనివారం మీడియా సమావేశంలో ఆకిబ్ జావేద్ మాట్లాడుతూ.. ‘నేటి తరంలో బుమ్రా ఒక అసాధారణ బౌలర్. అతని బౌలింగ్ యాక్షన్ కూడా భిన్నంగానే ఉంటుంది. బుమ్రా బౌలింగ్ చేయడానికి వచ్చినప్పుడల్లా మా పాక్ బౌలర్లలో ఉస్మాన్ తారిఖ్‌లాగే కనిపిస్తాడు. బుమ్రా వేగంతో బంతిని విసరడంలో దిట్ట అయినప్పటికీ అతని బౌలింగ్ శైలి ప్రత్యర్థి బ్యాటర్లను గందరగోళానికి గురి చేస్తుంది. స్మిన్నర్ తారిఖ్ కూడా బ్యాటర్లను తికమక పెట్టేందుకే బంతిని కాస్త ఆలస్యంగా విసురుతుంటాడు. ఈ టెక్నిక్‌ను ఉపయోగించే తారిఖ్ టీ20 ప్రపంచకప్‌లో 10వికెట్లు పడగొట్టాడు. ఇక టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా కాకుండా వేరే బౌలర్ ఎవరైనా మంచి ప్రదర్శన చేశారని చెప్పడం కష్టమే. ముఖ్యంగా టోర్నీ సెకండ్ హాఫ్‌లో భారీ స్కోర్లు నమోదైనప్పటికీ బుమ్రా మాత్రం తన వినూత్న బౌలింగ్‌తో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అంతేకాదు బుమ్రా తన బౌలింగ్‌తో మేటి బౌలర్లు వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్‌ల ప్రతిబింబాన్ని గుర్తుకు తెచ్చాడని చెప్పొచ్చు. ఇకపై బుమ్రా లాంటి బౌలర్ దొరకడు’ అని పేర్కొన్నాడు. కాగా ఆకిబ్ జావేద్ బుమ్రాను పొగడడం వరకు బాగానే ఉన్నప్పటికీ తన స్థాయికి ఏమాత్రం తూగని ఉస్మాన్ తారిఖ్‌తో పోల్చడమే క్రికెట్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ‘బుమ్రాతో అతడికి పోలికేంటి?’, ‘బుమ్రా ఎక్కడ.. తారిఖ్ ఎక్కడ? స్థాయి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందేమో’, ‘బుమ్రా లాంటి నంబర్‌వన్ బౌలర్‌ను పెద్దగా గుర్తింపు లేని ప్లేయర్‌తో పోల్చడానికి సిగ్గు ఉండాలి’ అని కామెంట్లు చేశారు.ఇక టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా 14 వికెట్లు పడగొట్టి మరో భారత స్పిన్నర్ వరుణ్‌చక్రవర్తితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. మరోవైపు వివాదాస్పద బౌలర్‌గా పేరు పొందిన ఉస్మాన్ తారిఖ్ టీ20 ప్రపంచకప్‌లో 10 వికెట్లు పడగొట్టాడు.Jasprit Bumrah Is The Usman Tariq Of Fast Bowling. Aqib Javed #pakistancricketteam pic.twitter.com/eEotIXvyt5— Shreyas Iyer Fan Page (@IyerFanPage) March 14, 2026చదవండి: ముమ్మాటికీ అఘాదే తప్పు.. ఐసీసీ సీరియస్ -
పాక్ వివాదాస్పద బౌలర్‌కు జాక్‌పాట్
హండ్రెడ్ లీగ్ చరిత్రలో తొలిసారి నిర్వహిస్తున్న వేలంలో పాకిస్తాన్ వివాదాస్పద స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ జాక్‌పాట్ కొట్టాడు. ఇతన్ని బర్మింగ్హమ్ ఫీనిక్స్ 1.4 లక్షల స్టెర్లింగ్ పౌండ్లకు (రూ. 1.72 కోట్లు) దక్కించుకుంది. లక్ష పౌండ్ల బేస్ ప్రైజ్ విభాగంలో నిలిచిన తారిక్ కోసం ట్రెంట్ రాకెట్స్ కూడా పోటీపడింది. ఫీనిక్స్, రాకెట్స్ రెండూ ఐపీఎల్ యాజమాన్యాల ఆథ్వర్యంలో నడిచే ఫ్రాంచైజీలు కావు. ఈ వేలంలో అమ్ముడుపోయిన తొలి పాకిస్తాన్ ఆటగాడు తారిక్. ఇతనికి ముందు హరీస్ రౌఫ్, షాదాబ్ ఖాన్ వేలానికి వచ్చినా, వారిని ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. పాక్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది వేలం ప్రారంభానికి కొద్ది గంటల ముందు వైదొలిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అఫ్రిది, రౌఫ్ మార్కీ ప్లేయర్లుగా వేలంలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు.తొలిసారి వేలంహండ్రెడ్ లీగ్‌లో వేలం జరగడం ఇదే తొలిసారి. దీనికి ముందు ఆటగాళ్ల ఎంపిక డ్రాఫ్ట్ పద్దతిలో జరిగేది. నిన్న (మార్చి 11) మహిళల హండ్రెడ్ లీగ్ వేలం పూర్తైంది. ఈ వేలంలో సోఫీ డివైన్, బెత్ మూనీ, దీప్తి శర్మ, రిచా ఘోష్ లాంటి స్టార్ ప్లేయర్లు లాభదాయకమైన కాంట్రాక్టులు పొందారు. అయితే ఈ వేలంలో పాక్ ప్లేయర్లకు ఘోర అవమానం ఎదురైంది. ఆ జట్టు ప్లేయర్లపై ఏ ఒక్క ఫ్రాంచైజీ ఆసక్తి కనబర్చలేదు. వారి కెప్టెన్ ఫాతిమా సనా కూడా అన్ సోల్డ్‌గా మిగిలిపోయింది.నిర్వహకులు భరోసా ఇచ్చినా..!ప్రస్తుతం హండ్రెడ్ లీగ్‌లో మెజారిటీ ఫ్రాంచైజీలు ఐపీఎల్ యాజమాన్యాలు ఆథ్వర్యంలో నడుస్తున్నాయి. సాధారణంగా ఐపీఎల్ యాజమాన్యాలు పాకిస్తాన్ ఆటగాళ్లను దూరంగా ఉంచుతాయి. అయితే హండ్రెడ్ లీగ్‌లో మాత్రం ఆ పరిస్థితి లేదు. లీగ్ నిర్వాహకులు పాక్ ఆటగాళ్లపై ఎలాంటి వివక్ష ఉండదని ముందే స్పష్టం చేశారు. దీంతో ఈ వేలంలో 63 మంది పాక్ ఆటగాళ్లు రిజిస్టర్ చేసుకున్నాయి. అయితే వీరిలో 14 మంది మాత్రమే షార్ట్‌లిస్ట్ అయ్యారు. ఈ 14 మందిలో ప్రస్తుతానికి ఉస్మాన్ తారిక్ ఒక్కడే అమ్ముడుపోయాడు.అనామక ఆటగాడిపై కనకవర్షంఇప్పటివరకు జరిగిన వేలంలో ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్ జేమ్స్ కోల్స్ అత్యధికంగా 3.9 లక్షల స్టెర్లింగ్ పౌండ్లు (లండన్ స్పిరిట్) దక్కించుకున్నాడు. భారత కరెన్సీలో ఈ మొత్తం రూ. 4.8 కోట్లు. కోల్స్ తర్వాత అత్యధిక ధర జోర్డన్ కాక్స్‌కు దక్కింది. అతన్ని వెల్ష్‌ఫైర్ 3 లక్షల పౌండ్లకు (రూ. 3.6 కోట్లు) సొంతం చేసుకుంది. -
భారత్ చేతిలో ఓడినా.. చరిత్ర సృష్టించిన పాక్
టీమిండియా చేతిలో ఓడినా పాకిస్తాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచకప్ టోర్నీలో రెండుసార్లు 18 ఓవర్లపాటు స్పిన్ బౌలింగ్‌నే ప్రయోగించిన తొలి జట్టుగా నిలిచింది.స్పిన్ దళంపైనే నమ్మకంటీ20 వరల్డ్‌కప్-2026 టోర్నీలో భాగంగా కొలంబో వేదికగా పాకిస్తాన్ ఆదివారం టీమిండియాతో తలపడిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న పాక్.. తమ స్పిన్ దళంపైనే ఎక్కువగా ఆధారపడింది. స్పెషలిస్టు స్పిన్నర్లలో ఉస్మాన్ తారిఖ్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 24 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీయగా.. అబ్రార్ అహ్మద్ మూడు ఓవర్లు వేసి 38 పరుగులు ఇచ్చుకున్నాడు.ఇక బ్యాటింగ్ ఆల్‌రౌండర్లు సల్మాన్ ఆఘా రెండు ఓవర్లు వేసి 10 పరుగులిచ్చి ఒక వికెట్ తీయగా.. నాలుగు ఓవర్ల కోటాలో సయీమ్ ఆయుబ్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. మరోవైపు షాదాబ్ ఖాన్ ఒక ఓవర్ వేసి 17 రన్స్, మొహమ్మద్ నవాజ్ 4 ఓవర్లలో 28 రన్స్ ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.షాహిన్ ఆఫ్రిది విఫలంఇలా నిర్ణీత 20 ఓవర్లలో 18 ఓవర్లు పాక్ స్పిన్నర్లే వేయగా.. ఏకైక పేసర్ షాహిన్ ఆఫ్రిది రెండు ఓవర్లు వేసి ఏకంగా 31 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కాగా పాక్ ఇలా స్పిన్ దళాన్నే నమ్ముకోవడం ఇదే తొలిసారి కాదు. 2012 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఆస్ట్రేలియా మీద కూడా ఇదే తరహాలో ఇదే వేదికపై స్పిన్ అస్త్రాన్ని ప్రయోగించింది పాక్.తద్వారా పొట్టి వరల్డ్‌కప్ ఈవెంట్లో అత్యధికంగా రెండుసార్లు 18 ఓవర్లు స్పిన్ వేయించిన తొలి జట్టు పాకిస్తాన్ నిలిచింది. కాగా కొలంబో పిచ్ స్పిన్‌కు అనుకూలం అన్న సంగతి తెలిసిందే. ఇక భారత్‌తో మ్యాచ్‌లో పాక్ 61 పరుగుల తేడాతో ఓడిపోయింది.టీమిండియా ఇలాఈ మ్యాచ్‌లో పాక్ ప్రధానంగా స్పిన్‌ను నమ్ముకుంటే.. టీమిండియా పేసర్లకు కూడా ప్రాధాన్యం ఇచ్చింది. భారత పేసర్లలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మూడు ఓవర్లు వేసి కేవలం 16 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెండు ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు కూల్చాడు.ఇక స్పిన్నర్లలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ నాలుగు ఓవర్లు వేసి రెండు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి మూడు ఓవర్లలోనే రెండు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ మూడు ఓవర్లు వేసి ఒక వికెట్ పడగొట్టగా.. పార్ట్‌టైమ్ స్పిన్నర్లు తిలక్ వర్మ రెండు ఓవర్లు వేసి ఒక వికెట్ తీయగా.. రింకూ సింగ్ ఒక ఓవర్లో 9 పరుగులు సమర్పించుకున్నాడు.ఇదిలా ఉంటే.. తాజా వరల్డ్‌కప్ ఎడిషన్‌లో పాకిస్తాన్ యూఎస్ఏతో మ్యాచ్‌లో కూడా ఏకంగా 16 ఓవర్లు స్పిన్ బౌలింగ్ వేయించడం గమనార్హం.చదవండి: అభిషేక్ శర్మ ఫెయిల్.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు -
అందుకే ఓడిపోయాం.. ప్రధాన కారణం వాళ్లే: పాక్ కెప్టెన్
టీమిండియా చేతిలో పాకిస్తాన్‌కు మరోసారి పరాభవమే ఎదురైంది. భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తామంటూ గొప్పలకు పోయి.. ఆ తర్వాత దిగివచ్చిన దాయాదికి సూర్య సేన దిమ్మతిరిగేలా షాకిచ్చింది. టీ20 ప్రపంచకప్-2026లో పాక్‌ను 61 పరుగుల తేడాతో చిత్తు చేసి మరోసారి ఆధిపత్యాన్ని చాటుకుంది.ప్రధాన కారణం వాళ్లేఈ నేపథ్యంలో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా (Salman Ali Agha) స్పందిస్తూ.. తమ ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఈరోజు మా స్పిన్నర్లపైనే నమ్మకం ఉంచాము. కానీ వారు రాణించలేకపోయారు. ప్రణాళికలను అమలు చేయడంలో మా వాళ్లు సఫలం కాలేదు. గత ఆర్నెళ్లుగా వారు విజయవంతమైన దళంగా కొనసాగుతున్నారు.కానీ ఇప్పుడు అనుకున్న ఫలితాన్ని రాబట్టలేకపోయారు. ఇక మా బ్యాటర్లు కూడా విఫలమయ్యారు. పవర్ ప్లేలోనే 3-4 వికెట్లు కోల్పోవడం ప్రతికూల ప్రభావం చూపింది. లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే వికెట్లు కోల్పోతే ఒత్తిడి మరింత ఎక్కువవుతుంది.పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుందనే టాస్ గెలిచిన తర్వాత నేను బౌలింగ్ ఎంచుకున్నాను. బంతిపై గ్రిప్పింగ్ కూడా బాగానే ఉంది. కానీ మా వాళ్లు తమ వ్యూహాల్ని అమలు చేయలేకపోయారు. పరిస్థితికి తగ్గట్లు మా వాళ్లు బౌలింగ్ చేయలేదు.బ్యాటింగ్ ఆర్డర్ కూడా విఫలంమా బ్యాటింగ్ ఆర్డర్ కూడా విఫలమైంది. ఇలాంటి మ్యాచ్‌లలో భావోద్వేగాలు ఎక్కువగా ఉండటం సహజమే. అయితే, మేము ఇప్పటికే ఎంతో క్రికెట్ ఆడాము. మాకు ఇలాంటి పరిస్థితులు కొత్తేమీ కాదు. తదుపరి మ్యాచ్‌లో గెలిచి సూపర్ 8కు చేరాలని పట్టుదలగా ఉన్నాము’’ అని సల్మాన్ ఆఘా చెప్పుకొచ్చాడు. సమిష్టి వైఫల్యం కారణంగానే తాము పరాజయం పాలయ్యామని పొరపాట్లను అంగీకరించాడు.వికెట్లు తీసినా..కాగా కొలంబోలో టాస్ గెలిచిన పాక్.. తొలుత బౌలింగ్ చేయగా.. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో స్పిన్ ఆల్‌రౌండర్లు సయీమ్ ఆయుబ్ మూడు వికెట్లు తీయగా.. సల్మాన్ ఆఘా ఒక వికెట్ తీశాడు, ఆఫ్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్, పేసర్ , షాహిన్ ఆఫ్రిది ఒక్కో వికెట్ పడగొట్టారు. అయితే, పాక్ స్పిన్నర్లు వికెట్లు తీసినా కూడా పరుగులు కూడా ఎక్కువే ఇచ్చుకోవడం గమనా ర్హం.పెవిలియన్‌కు క్యూ కట్టిన బ్యాటర్లుఇక లక్ష్య ఛేదనలో పాకిస్తాన్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్లలో సాహిబ్జాదా ఫర్హాన్ డకౌట్ కాగా.. సయీబ్ ఆయుబ్ 6.. వన్‌డౌన్ బ్యాటర్ సల్మాన్ ఆఘా 4, తర్వాతి స్థానాల్లో వచ్చిన బాబర్ ఆజం 5 పరుగులకే పెవిలియన్ చేరారు.BIGGEST WIN FOR INDIA OVER PAKISTAN IN T20Is (61 runs)! 🤯With that, they make it 8-1 in #INDvPAK in the ICC Men's T20 World Cup and qualify for the Super 8! 👏Watch them next in ICC Men's #T20WorldCup | #INDvNED | WED, 18 FEB, 6 PM! pic.twitter.com/na6yc5i7Pz— Star Sports (@StarSportsIndia) February 15, 2026వికెట్ కీపర్ బ్యాటర్ ఉస్మాన్ ఖాన్ (44) మెరుగ్గా రాణించగా.. షాహిన్ ఆఫ్రిది 23 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగిలిన వాళ్లంతా తేలిపోయారు. టీమిండియా బౌలర్లలో స్పిన్నర్లు అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి చెరో రెండు, కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ తలా ఒక వికెట్ తీశారు. పేసర్లు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా చెరో రెండు వికెట్లు కూల్చారు.చదవండి: అతడు అత్యద్భుతం.. ఇది ఇండియా కోసం: సూర్య -
మా బౌలర్‌ను చూసి టీమిండియా భయపడుతోంది: పాక్ మాజీ కెప్టెన్
క్రికెట్ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు మరి కొన్ని గంటల్లో తెరలేవనుంది. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా కొలంబో వేదికగా చిరకాల ప్రత్యర్ధులు అమీతుమీ తెల్చుకోనున్నారు. అయితే ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు పాక్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ హాట్ టాపిక్‌గా నిలిచాడు.అతడి బౌలింగ్ శైలి భిన్నంగా అందుకు కారణం. బౌలింగ్ చేసే సమయంలో కొన్ని సెకన్లు ఆగి బంతిని విడుదల చేయడం అతడి స్పెషాలిటి. ఇప్పటివరకు భారత బ్యాటర్లు ఒక్కరు కూడా అతడి బౌలింగ్‌ను ఒక్కసారి కూడా ఎదుర్కొలేదు. దీంతో ఈ వరల్డ్‌కప్ మ్యాచ్‌లో అతడిని భారత బ్యాటర్లు ఎలా ఆడుతారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఉస్మాన్ కోసం టీమిండియా బ్యాటర్లు ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ హఫీజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందే తారిక్ భారత్‌పై పైచేయి సాధించాడని హఫీజ్ అన్నాడు."ఉస్మాన్ తారిక్ ఇప్పటికే భారత్‌పై సైకిలాజికల్‌గా విజయం సాధించాడు. ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుతం, బాబర్ అజామ్ లేదా మరెవరి గురించి ఎవరూ చర్చించడం లేదు. మీడియా, ఫ్యాన్స్ అంతా తారిఖ్ గురించే మాట్లాడుతున్నారు. భారత డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా తారిఖ్ పట్ల ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.అతడు పాకిస్తాన్ తరపున నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అయినప్పటికి అతడిని ఎదుర్కొవడానికి భారత్ ప్రత్యేక వ్యూహాలు రచిస్తోంది. ఈ మ్యాచ్‌లో ఉస్మాన్‌ను కెప్టెన్ సల్మాన్ అఘా ఎలా ఉపయోగిస్తాడో చూడాలనుకుంటున్నాను. అతడిని 6వ ఓవర్లోనే రంగంలోకి దించితే బ్యాటర్లను కట్టడి చేయవచ్చు" అని తప్మాడ్ అనే ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హఫీజ్ పేర్కొన్నాడు. -
IND vs PAK: అతడి ఆటకు మేము లొంగిపోము: సూర్య
పాకిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ గురించి టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడు వైవిధ్యమైన బౌలర్ అన్న మాట వాస్తవమేనని.. అయితే, తాము మాత్రం అతడి ఆటకు లొంగమని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్తాన్ ఆదివారం ముఖాముఖి తలపడనున్న విషయం తెలిసిందే. శ్రీలంకలోని కొలంబోలో గల ఆర్.ప్రేమదాస స్టేడియం ఇందుకు వేదిక.అపుడే చూస్తారుఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) పలు విషయాలపై స్పందించాడు. ముఖ్యంగా పాక్ ఆటగాళ్లతో ఈసారి కరచాలనం చేస్తారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘మేం చక్కటి క్రికెట్ ఆడేందుకే ఇక్కడికి వచ్చాం. అది మాత్రమే అత్యంత ముఖ్యం. మిగతావన్నీ అనవసర విషయాలు.షేక్ హ్యాండ్ ఇచ్చే విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పను. మ్యాచ్ ప్రారంభమైనప్పుడే మీరు చూస్తారు’’ అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. సున్నా నుంచి మొదలుఇక టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో పాక్‌పై 7-1తో భారత్ ఆధిపత్యం కొనసాగిస్తున్న అంశం ప్రస్తావనకు రాగా.. ‘‘పాక్‌పై పాత రికార్డు ఇక్కడ పనికి రాదు. మళ్లీ సున్నా నుంచి స్కోరు మొదలు పెట్టాల్సిందే’’ అని సూర్య నిజాయితీగా సమాధానం ఇచ్చాడు.అదే విధంగా ఉస్మాన్ తారిఖ్ (Usman Tariq)నైపుణ్యాల గురించి విలేకరులు ప్రస్తావించగా.. ‘‘పరీక్షలో సెలబస్ నుంచి కాకుండా ఇతర అంశాల గురించి ప్రశ్నలు వచ్చినంత మాత్రాన దానిని వదిలివేయలేము కదా!.. అతడి ఆటకు మేము లొంగిపోముఅతడొక వైవిధ్యమైన బౌలర్. అయినంత మాత్రాన మేము అతడి ఆట ముందు లొంగిపోము. అతడి బౌలింగ్‌లో ఆడేందుకు మా వాళ్లు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు’’ అని సూర్య పేర్కొన్నాడు.చకింగ్ ఆరోపణలుకాగా తన వైవిధ్యమైన బౌలింగ్ శైలితో పాక్ ఆఫ్‌స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ వార్తల్లో నిలుస్తున్నాడు. ‘చకింగ్ (సందేహాస్పద బౌలింగ్)’ చేస్తున్నాడంటూ ఆరోపణలు వినిపించినా...రెండు సార్లు అతడి యాక్షన్‌కు ఐసీసీ అనుమతి ఇచ్చింది. కాబట్టి నిబంధనల ప్రకారం తప్పు లేకపోవచ్చు. ఈ విషయం గురించి పలువురు మాజీ అంపైర్లు కూడా ఇదే చెప్పారు.అయితే బంతి విసిరే ముందు అతను కాస్త ఆగినట్లుగా ఉంటూ (పాజ్) వేయడం చర్చకు దారి తీసింది. ఇది బ్యాటర్‌ను గందరగోళంలో పడేయవచ్చని... బ్యాటర్ కూడా కాస్త జరిగి షాట్ ఆడటమే దీనికి ఉపాయమని అశ్విన్ విశ్లేషించాడు. అంత సీన్ లేదుఅయితే తారిఖ్ యాక్షన్ ఎలా ఉన్నా... అతడు సాధారణ ఆఫ్‌స్పిన్నర్ మాత్రమేనని మాజీ కెప్టెన్ గంగూలీ అభిప్రాయ పడ్డాడు. భారత బ్యాటర్లు అతడి బౌలింగ్‌లో చెలరేగుతారని ధీమా వ్యక్తం చేశాడు.చదవండి: T20 WC 2026: పాక్‌తో మ్యాచ్.. భారత తుది జట్టు ఇదే! వారిద్దరిపై వేటు -
'అతడితో జాగ్రత్త'.. పాక్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు వార్నింగ్
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. హై-వోల్టేజ్ పోరుకు ముందు టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్‌ను తక్కువగా అంచనా వేయవద్దని భారత జట్టును భజ్జీ హెచ్చరించాడు.ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో భారత్ గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ పాకిస్తాన్ జట్టులో ఉస్మాన్ తారిక్ లాంటి అద్భుతమైన స్పిన్నర్ ఉన్నాడు. అతడిని భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాలి. అయితే మన జట్టుపై పూర్తి నమ్మకం నాకు ఉంది. భారత జట్టు ప్రస్తుతం చాలా పటిష్టంగా ఉంది. టీమిండియా ఎప్పటిలాగే ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడి గెలుపు జెండా ఎగరవేస్తారని ఆశిస్తున్నాము అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భజ్జీ పేర్కొన్నాడు.కాగా ఉస్మాన్ తారిఖ్ తన బౌలింగ్ యాక్షన్‌తో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. అతడి బౌలింగ్‌ను ఆర్ధం చేసుకునేందుకు బ్యాటర్లు తెగ ఇబ్బంది పడుతున్నారు. బంతిని విసిరే ముందు కొద్దిసేపు ఆగి డెలివరీ చేసే అతడి బౌలింగ్ శైలి కేదార్ జాదవ్‌ను తలపిస్తోంది. అతడి బౌలింగ్ యాక్షన్‌పై వివాదాలు తలెత్తినప్పటికి.. ఐసీసీ మాత్రం క్లియరెన్స్ ఇచ్చింది. తారిఖ్ ఇప్పటివరకు కేవలం 4 టీ20 మ్యాచ్‌లు మాత్రమే ఆడి 11 వికెట్లు పడగొట్టాడు. పాక్ జట్టు కూడా అతడిపైనే గంపెడు ఆశలు పెట్టుకుంది.చదవండి: T20 WC 2026: భారత ఆటగాళ్లతో కరచాలనం చేస్తారా? పాక్ కెప్టెన్ రిప్లై ఇదే -
నిన్ను నాశనం చేస్తా: తీవ్ర స్థాయిలో మండిపడ్డ భజ్జీ
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కు కోపమొచ్చింది. ఇంకోసారి ఇలాగే వాగితే సర్వనాశనం చేస్తా అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్‌పై భజ్జీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత భజ్జీ క్రీడా విశ్లేషకుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.పాక్ క్రికెటర్ల వెంటపడతాడుఈ క్రమంలో ఇటీవల యూఏఈ వేదికగా ILT20 లీగ్‌లో భజ్జీ బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరించాడు. ఇందులో భాగంగా పాకిస్తాన్ వివాదాస్పద స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ (Usman Tariq)ను ఇంటర్వ్యూ చేశాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తన్వీర్ అహ్మద్ అనే ఓ పాక్ మాజీ ఆటగాడు భజ్జీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ క్రికెటర్లతో తిరుగుతూ ఉంటేనే నీకు గుర్తింపు అన్నట్లుగా ఓవరాక్షన్ చేశాడు.ఈ నేపథ్యంలో భజ్జీ ఘాటుగా స్పందించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా.. ‘‘ఈ వీడియో ఓ తుచ్ఛ మానవుడి గురించి. అతడు నా గురించి ఏవేవో మాట్లాడుతున్నాడు. అతడి పేరేంటో కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను అతడిని ఇంత వరకు ఒక్కసారి కూడా చూడనేలేదు.ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రంలా బిల్డప్ఇలాంటి వ్యక్తి తనకంటూ గుర్తింపు సంపాదించుకునే క్రమంలో వివిధ ప్లాట్‌ఫామ్‌లలో డ్రామా చేస్తూ ఉంటాడు. నాకైతే ఆ వ్యక్తి గురించి ఏమాత్రం తెలియదు. మీలో ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి. అతడి పేరు తన్వీర్ అహ్మద్ అట.పాకిస్తాన్ తరఫున అతడు 3-4 మ్యాచ్‌లు ఆడి ఉంటాడు. కానీ తానేదో ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనిస్ అన్నట్లుగా బిల్డప్‌లు ఇస్తూ ఉంటాడు. ఓ బ్రాడ్‌కాస్టర్‌గా ILT20 టోర్నీలో నా పని నేను పూర్తి చేశాను. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఉస్మాన్ తారిఖ్‌ను ప్రశ్నలు అడిగాను.ఆ మ్యాచ్‌లో అతడు మూడు వికెట్లు తీసి తన జట్టును గెలిపించుకున్నాడు. ఓ బ్రాడ్‌కాస్టర్‌గా నేను అతడిని ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. కానీ ఈ వ్యక్తి (తన్వీర్)కి ఇదే సమస్యగా మారిందట. పాకిస్తానీ క్రికెటర్ కనిపిస్తే చాలు వారి వెంట నేను తిరుగుతానట.దిగజారుడు చానెళ్లలో దిగజారుడు వ్యాఖ్యలుచెవులు రిక్కించుకుని విను. నువ్వెవరో కూడా నాకు తెలియదు. పాకిస్తాన్ నుంచి వచ్చిన దిగ్గజ క్రికెటర్లు ఎవరూ కూడా నీలాగా నోరు పారేసుకోలేదు. వాళ్లు తమకంటూ ప్రత్యేక గౌరవాన్ని సంపాదించుకున్నారు. కానీ నీలాంటి వాళ్లు.. జీవితంలో ఏదీ సాధించకపోయినా ఓ చోట కూర్చుని దిగజారుడు చానెళ్లలో దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.నిన్ను నాశనం చేస్తా. . జాగ్రత్తఇప్పటికైనా మాట్లాడే విధానం తెలుసుకో. ఐదు మ్యాచ్‌లు ఆడిన వాడికి 100 మ్యాచ్‌లు ఆడిన వాడికి తేడా ఉంటుంది. కాబట్టి తన్వీర్ అహ్మద్ నీ స్థాయి ఏమిటో తెలుసుకో. మరోసారి ఇలాగే వాగావు అంటే నిన్ను నాశనం చేస్తా. జాగ్రత్త’’ అంటూ భజ్జీ ఫైర్ అయ్యాడు.కాగా టీమిండియా తరఫున హర్భజన్ సింగ్ 1998- 2016 మధ్య 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ ఖాతాలో 417 టెస్టు వికెట్లు, 269 వన్డే వికెట్లు, 25 టీ20 వికెట్లు ఉన్నాయి.మరోవైపు.. రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ తన్వీర్ అహ్మద్ పాక్ తరఫున 5 టెస్టులు, 2 వన్డేలు, ఒక టీ20 ఆడాడు. ఆయా ఫార్మాట్లలో 17, 2, ఒక వికెట్ తీశాడు.చదవండి: IND vs PAK: 'ఈజీగా ఔట్ చేయవచ్చు'.. అభిషేక్‌ను ఎగతాళి చేసిన పాక్ మాజీ ఆటగాడు -
అది లీగల్: పాక్ స్పిన్నర్‌కు అశ్విన్ మద్దతు
పాకిస్తాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్‌కు టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ అండగా నిలిచాడు. అతడి బౌలింగ్ యాక్షన్‌ను పెద్దగా తప్పుబట్టాల్సిన పనిలేదన్నాడు. క్రీజు వద్ద కాస్త ఆగి బంతిని రిలీజ్ చేయడంలో తప్పులేదని.. అది అతడి సహజ శైలి అని మద్దతుగా నిలిచాడు.పాకిస్తాన్ తరఫున గతేడాది అరంగేట్రం చేసిన ఉస్మాన్ తారిఖ్ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఆడే పాక్ జట్టులో చోటు దక్కించుకున్న అతడు.. మంగళవారం అమెరికాతో మ్యాచ్‌లో పాల్గొన్నాడు. కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఉస్మాన్ తారిఖ్ నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి 27 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.అయితే, ఉస్మాన్ ప్రదర్శన కన్నా అతడి బౌలింగ్ యాక్షన్ తీరే నెట్టింట వైరల్‌గా మారింది. సందేహాస్పద రీతిలో అతడు బౌలింగ్ చేశాడంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్ శ్రీవత్స్ గోస్వామి ఘాటుగా స్పందించాడు.ఇది కొనసాగకూడదు‘‘పెనాల్టీ రన్ అప్ సమయంలో ఫుట్‌బాల్‌లో కూడా ఇలాంటివి అనుమతించరు. అతడి బౌలింగ్ యాక్షన్ ఏవిధంగా సమంజసం? సరే సరిగ్గానే బౌలింగ్ చేశాడనుకుందాం. మరి పాజ్ (కాసేపు ఆగడం) ఎందుకు ఇచ్చినట్లు? అది కూడా బంతిని రిలీజ్ చేసే సమయంలో ఇలా ఎందుకు చేశాడు? ఇది కొనసాగకూడదు’’ అని శ్రీవత్స్.. ఉస్మాన్ బౌలింగ్ చేస్తున్న దృశ్యాన్ని పంచుకున్నాడు. బౌలర్ మీదే ఆంక్షలు ఎందుకు?ఇందుకు అశ్విన్ స్పందిస్తూ.. ‘‘నిజమే.. ఫుట్‌బాల్‌లో కూడా ఇలాంటివి అనుమతించరు. మరి ఓ బ్యాటర్ స్విట్ హిట్ లేదంటే రివర్స్ షాట్ ఆడుతున్నపుడు అంపైర్ లేదంటే బౌలర్‌కు సమాచారం ఇవ్వకుండానే షాట్లు ఆడతారు కదా.అలాంటపుడు బ్యాటర్ మీద లేని ఆంక్షలు బౌలర్ మీదే ఎందుకు? నిజం చెప్పాలంటే బౌలర్ తన చేతివాటాన్ని మార్చే ముందు కచ్చితంగా అంపైర్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనను తొలుత మార్చాలి.ఏదేమైనా ఉస్మాన్ బౌలింగ్ యాక్షన్ చట్టబద్ధమా? కాదా? అన్నది ఐసీసీ బౌలింగ్ యాక్షన్ టెస్టింగ్ సెంటర్లో మాత్రమే తేలుతుంది. అక్కడ మాత్రమే అతడిని పరీక్షించే అవకాశం ఉంటుంది.అతడి సహజశైలి కాబట్టి లీగలేనిబంధన ప్రకారం.. మోచేయిని నిటారుగా చేసి బంతిని రిలీజ్ చేయాలి. అయితే, అతడు బంతిని విసురుతున్నాడా? లేదంటే సరిగ్గానే బౌలింగ్ చేస్తున్నాడా అన్నది ఆన్‌ఫీల్డ్ అంపైర్ నిర్ధారించడం అసాధ్యం.ఈ సమస్యకు పరిష్కారం దొరకాలంటే మ్యాచ్ జరుగుతున్నపుడు రియల్‌టైమ్ టెస్టింగ్ టూల్‌ను వాడాలి. కానీ ఇక్కడ సరైన ఆధారం లేకుండా ఒకరిని నిందించడం తప్పు. ఏదేమైనా క్రీజులోకి వచ్చాక అలా పాజ్ ఇవ్వడం చట్టబద్ధమో కాదో చెప్పలేము. అయితే, అది అతడి సహజశైలి కాబట్టి లీగలే అని నేను నమ్ముతాను’’ అంటూ అశ్విన్ బదులిచ్చాడు.ఈ నేపథ్యంలో శ్రీవత్స్‌కు మద్దతుగా.. అశ్విన్‌ను వ్యతిరేకిస్తూ టీమిండియా అభిమానులు విమర్శిస్తున్నారు. ఉస్మాన్ బౌలింగ్ చేయకుండా బంతిని విసురుతున్న తీరు కనిపిస్తుంటే అశూ.. అతడికి మద్దతునివ్వడం ఏమాత్రం బాగాలేదంటూ ట్రోల్ చేస్తున్నారు.చదవండి: ఛీ.. ఇదేం బుద్ధి?.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బంగ్లాదేశ్Agree football doesn’t allow it!While the batter can be allowed to switch hit or reverse without informing the umpire or bowler, after him/her commits to start batting on one side, why are the restrictions only limited to the bowler?In fact the bowler isn’t allowed to change… https://t.co/AOV4OKhwcL— Ashwin 🇮🇳 (@ashwinravi99) February 11, 2026


